ఆ బ్లాక్ బస్టర్ మూవీ నా బయోపిక్కే.. వేణు స్వామి సంచలన కామెంట్స్.?

Pandrala Sravanthi
ఇండస్ట్రీలో  ఒక స్టార్ హీరో కు ఉన్నంత క్రేజ్ ఆ జ్యోతిష్కుడు కి ఉంటుంది.. ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే వేణు స్వామి.. జ్యోతిష్యం ద్వారా ఎంతోమంది హీరోయిన్లకు, హీరోలకు  లైఫ్ ఇచ్చానని ఆయన చెబుతూ ఇండస్ట్రీ లో ఫేమస్ అయ్యారు. అలాంటి ఆయన ఒక స్టార్ హీరో  చేసిన సినిమా నా బయోపిక్ గా తీసారని  ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చారు.. మరి ఆ సినిమా ఏంటి వివరాలు చూద్దాం.. అయితే వేణు స్వామి జ్యోతిష్యాలు చెప్పడమే కాకుండా చాలామంది హీరో హీరోయిన్ల సినిమాలకు కొబ్బరికాయలు కొట్టి ఓపెనింగ్ లు కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వేణు స్వామి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..ఒక స్టార్ హీరో నా బయోపిక్ మీద సినిమా తీశారని ఆ చిత్రం సూపర్ హిట్ అయింది అని చెప్పుకొచ్చారు.


 ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే జూనియర్ ఎన్టీఆర్,డైరెక్టర్ వివి వినాయక్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ  2010లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ సాధించింది. ఇంతకీ ఆ సినిమా ఏంటయ్యా అంటే అదుర్స్. ఇందులో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటించారు. ముఖ్యంగా చారి పాత్రలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. అలాగే షీలా, బ్రహ్మానందం, నయనతార  పలు పాత్రల్లో ఆకట్టుకున్నారు.. అయితే ఇందులో ఎన్టీఆర్ నటించిన రెండు పాత్రలు నావేనని చెప్పుకొచ్చారు వేణు స్వామి. నేను ఈ సినిమా స్టార్ట్ చేసే సమయంలో వెళ్లి కొబ్బరికాయ కొట్టాను.


ఇదే సమయంలో ఎన్టీఆర్ కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వచ్చింది.. సినిమా సూపర్ హిట్ అవుతుందని అప్పుడే చెప్పాను. నేను అన్నట్టుగానే ఆ చిత్రం అద్భుతమైన హిట్ సాధించింది.. అయితే ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వేణు స్వామి చెప్పుకొచ్చారు.. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతుంది.. ప్రస్తుతం ఎన్టీఆర్ పలు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ అద్భుతమైన హిట్లు సాధిస్తూ దూసుకుపోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: