రెమ్యూనరేషన్ భారీగా పెంచిన అనిల్ రావిపూడి.. చిరు సినిమా హిట్ తో నిర్మాతలకు చుక్కలే.!

Pandrala Sravanthi
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కష్టపడాల్సి ఉంటుంది.అది హీరో అయినా.. హీరోయిన్ అయినా..డైరెక్టర్ అయినా.. నిర్మాత అయినా.. ఎవరైనా సరే కష్టం చేయకుండా ఫలితం రాదు. అలా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వారు ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఇబ్బందులు పడినవారు ఉన్నారు.తక్కువ రెమ్యూనరేషన్ లకు వర్క్ చేసిన వారు ఉన్నారు.కానీ ఒక్కసారి ఇండస్ట్రీలో స్టార్ అయితే మాత్రం వారి సక్సెస్ కి ఇక అంతు ఉండదు. వారు చేసే సినిమాలు ఫ్లాప్ అయిన హిట్ అయినా కూడా రెమ్యూనరేషన్లు అలాగే ఉంటాయి. ఒకవేళ వాళ్ళు చేసే సినిమాలు వరుసగా హిట్స్ అయితే మాత్రం వారి రెమ్యూనరేషన్లు అమాంతం పెరిగిపోతాయి.అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆ హిట్ డైరెక్టర్ రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగిపోయింది. 


ఇక ఆ హిట్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే అనిల్ రావిపూడి.. తన మార్క్ కామెడీతో.. డైరెక్షన్ తో వరుస సినిమాలు హిట్స్ కొడుతూ టాలీవుడ్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఇప్పటివరకు చేసిన ప్రతి ఒక్క సినిమా హిట్టే.. ఆయన తీసిన ఏ ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. ఇప్పటివరకు ఇలాంటి రికార్డు టాలీవుడ్ లో రాజమౌళి కి ఉండేది.కానీ ఇప్పుడు ఈ లిస్టులోకి అనిల్ రావిపూడి కూడా చేరిపోయారు. అనిల్ రావిపూడి సీనియర్ హీరోలతో పాటు జూనియర్ హీరోలతో కూడా సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు.అలా ఇప్పటివరకు వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ ఈ ముగ్గురు హీరోలతో సినిమా చేసి హిట్స్ కొట్టారు  ఇక త్వరలోనే నాగార్జునతో కూడా సినిమా చేస్తానని తెలిపారు. అయితే రీసెంట్గా సంక్రాంతికి వచ్చిన చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అనిల్ రావిపూడి పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది.డైరెక్టర్ గా సక్సెస్ఫుల్గా సాగిపోతున్న అనిల్ రావిపూడి గురించి ఓ టాక్ వినిపిస్తోంది.


అనిల్ రావిపూడి తన సినిమాల సక్సెస్ తో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచినట్టు తెలుస్తోంది. అయితే మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి 20 నుండి 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ చేయబోయే సినిమాలకు భారీగా రెమ్యూనరేషన్ పెంచినట్టు తెలుస్తోంది. నెక్స్ట్ఏ హీరోతో చేసినా కూడా 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఒకవేళ ఇదే నిజమైతే హీరోల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునే డైరెక్టర్ల లిస్టులో అనిల్ రావిపూడి కూడా చేరిపోతారు. ఏది ఏమైనప్పటికి సినిమాల సక్సెస్ తో డైరెక్టర్ అనిల్ రావిపూడి గాడిన పడడమే కాకుండా తనతో సినిమాలు నిర్మించే నిర్మాతలకు చుక్కలు కనిపించినట్టే. ఎందుకంటే ఓ పక్క కోట్లకు కోట్ల హీరోలకు రెమ్యూనరేషన్ లు ఇవ్వడంతో పాటు డైరెక్టర్లకు కూడా భారీ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: