బన్నీ ఫ్యాన్స్ వెయిటింగ్ గేమ్.. ఆ మూవీ అసలు ఉందా లేదా?

Amruth kumar
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు వైల్డ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్! ఒకరు తన మేనరిజంతో, డ్యాన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసే 'పుష్పరాజ్', మరొకరు తన రా అండ్ రస్టిక్ మేకింగ్‌తో ఆడియన్స్‌కు పిచ్చెక్కించే 'యానిమల్' సృష్టికర్త. వీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న వార్తలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.సందీప్ వంగా సినిమా అంటే టైటిల్ దగ్గర నుంచే ఒక వైబ్రేషన్ ఉంటుంది. అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమాకు 'భద్రకాళి' అనే మాస్ అండ్ పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఫిలిం నగర్ సమాచారం. సందీప్ సొంత ప్రొడక్షన్ హౌస్ పేరు కూడా 'భద్రకాళి పిక్చర్స్' కావడం విశేషం. టైటిల్ వింటుంటేనే ఇది ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని, బన్నీ క్యారెక్టరైజేషన్ మునుపెన్నడూ చూడని విధంగా చాలా ఇంటెన్స్‌గా ఉంటుందని అర్థమవుతోంది.



ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే, అట్లీ దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ (AA22) పనుల్లో ఉన్నారు. మరోవైపు సందీప్ వంగా, ప్రభాస్‌తో 'స్పిరిట్' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. 'స్పిరిట్' షూటింగ్ పూర్తి కావడానికి 2026 చివరి వరకు సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి, బన్నీ - సందీప్ వంగా ప్రాజెక్ట్ 2027 ద్వితీయార్థంలో లేదా 2028 ఆరంభంలో పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఈలోపు సందీప్ 'యానిమల్ పార్క్' ను కూడా లైన్‌లో పెట్టారు.ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాణ దిగ్గజం టీ-సిరీస్ (T-Series) భూషణ్ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. సుమారు ₹500 కోట్లకు పైగా బడ్జెట్‌తో, హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉండబోతోందని టాక్. అల్లు అర్జున్ గ్లోబల్ ఇమేజ్‌కు, సందీప్ వంగా మేకింగ్ స్టైల్ తోడైతే, ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక భారీ పాన్-వరల్డ్ హిట్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


"ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది" అని పదే పదే చెప్పే సందీప్, బన్నీ లాంటి పెర్ఫార్మర్‌ను ఎలా చూపిస్తారో అని అందరూ ఆత్రుతగా ఉన్నారు. అల్లు అర్జున్ కూడా ఈ సినిమా కోసం స్పెషల్ మేకోవర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇద్దరు టాప్ స్టార్స్ తమ తమ కమిట్‌మెంట్స్ పూర్తి చేసుకున్నాక, ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తే బాక్సాఫీస్ రికార్డులు అన్నీ తిరగరాయాల్సిందే!లేట్ అయినా సరే, లేటెస్ట్ గా రావడం బన్నీ స్టైల్. గన్ లాంటి కథతో సందీప్ వంగా రెడీగా ఉన్నాడు, ట్రిగ్గర్ నొక్కడానికి ఐకాన్ స్టార్ వస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో రాబోయే 'వైల్డ్ రైడ్' కోసం ఇండియన్ సినిమా ప్రేక్షకులందరూ ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: