రూరల్ స్పోర్ట్స్ రచ్చకి రెడీ.. చరణ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వైరల్...!
ఇప్పటికే ఈ సినిమా ఢిల్లీ షెడ్యూల్‌ను అత్యంత వైభవంగా పూర్తి చేసుకుంది. అక్కడ ఎర్రకోట, రాష్ట్రపతి భవన్ వంటి ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ షెడ్యూల్‌లో విజువల్స్ అద్భుతంగా వచ్చాయని, చరణ్ తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారని చెప్పారు. ఇప్పుడు టీమ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక భారీ ఫైట్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేసింది. స్టంట్ మాస్టర్ శామ్ కౌశల్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీన్ కళ్ళు చెదిరేలా ఉండబోతోందట.ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం మరో పెద్ద ఎసెట్. ఇప్పటికే విడుదలైన మొదటి పాట 'చికీరి చికీరి' గ్లోబల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. 200 మిలియన్లకు పైగా వ్యూస్‌తో ఈ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. చరణ్ స్వైగ్ మరియు స్టెప్పులకు తోడు రెహమాన్ బీట్స్ కలవడంతో ఆ పాట మాస్ ఆడియన్స్‌కు పిచ్చెక్కిస్తోంది.
రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా 2026 మార్చి 27న ఈ సినిమాను పాన్-ఇండియా రేంజ్‌లో భారీగా విడుదల చేయబోతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.మొత్తానికి 'పెద్ది' సినిమా కోసం రామ్ చరణ్ చేస్తున్న మేకోవర్ చూస్తుంటే, ఈసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులన్నీ గల్లంతు అవ్వడం ఖాయం అనిపిస్తోంది. జిమ్‌లో ఆయన పడుతున్న ఈ కష్టం థియేటర్లలో 'మెగా' సక్సెస్‌గా మారాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.