హిట్ స్టేటస్కు అత్యంత దగ్గరగా అనగనగా ఒక రాజు..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి నవీన్ పోలిశెట్టి తాజాగా అనగనగా ఒక రాజు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మణులలో ఒకరు అయినటువంటి మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు నుండి మంచి కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి ..? ఈ మూవీ ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధిస్తే బ్రేక్ ఈవెన్ ఫార్మలా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 15.88 కోట్ల షేర్ కలక్షన్లు దక్కగా ... 26.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి మూడు రోజుల్లో 21.28 కోట్ల షేర్ ... 38.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా 28 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరి లోకి దిగింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ఫార్మలా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకోవాలి అంటే మరో 6.72 కోట్ల షేర్ కలెక్షన్లను అందుకోవాల్సి ఉంది. ఈ సినిమా మరో 6.72 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబడితే ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్టు స్టేటస్ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: