మృణాల్ ఠాకూర్, ధనుష్ ల గురించి ప్రస్తుతం నార్త్ సౌత్ ఇండస్ట్రీలో ఎన్ని వార్తలు గుప్పుమంటున్నయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంటర్నెట్ మొత్తం వీరి పెళ్లివార్తలతో నిండిపోయింది. ఫిబ్రవరి 14న ఈ జంట సైలెంట్ గా పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు కూడా వినిపించాయి. అయితే తాజాగా మృణాల్ టీం ఈ వార్తలను ఖండించినప్పటికీ ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా మృణాల్ ఠాకూర్,ధనుష్ ని పెళ్లి చేసుకోబోతుంది అనే పుకార్లు వైరల్ అవుతున్న నేపథ్యంలో మృణాల్ ఠాకూర్ ఇప్పటివరకు ఎంతమందితో డేటింగ్ చేసిందో తెలుసా అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇంతకీ మృణాల్ ఠాకూర్ ఇప్పటివరకు ఎంతమందితో డేటింగ్ చేసింది.. ధనుష్ నెంబర్ ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మృణాల్ ఠాకూర్ మొదట సినిమాల్లోకి రాకముందు హిందీ సీరియల్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అలా హిందీ సీరియల్స్ చేస్తున్న సమయంలో రైటర్ శరత్ త్రిపాఠి తో రిలేషన్ లో ఉన్నట్టు పుకార్లు వినిపించాయి.
ఆ తర్వాత వ్యక్తిగత విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఇక శరత్ త్రిపాఠి తర్వాత కుంకుం భాగ్య సీరియల్ చేస్తున్న సమయంలో తన సహనటుడు అయినటువంటి అర్జిత్ తనేజాతో మృణాల్ డేటింగ్ చేస్తున్నట్టు రూమర్స్ వినిపించాయి. వీరిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుండడంతో ఈ డేటింగ్ వార్తలు మరింత వైరల్ అయ్యాయి. ఇక అర్జిత్ తనేజా తర్వాత మరో టెలివిజన్ స్టార్ కుశాల్ టాండన్ తో కూడా మృణాల్ డేటింగ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. అయితే ఈ డేటింగ్ వార్తలను ఈ జంట ఖండించలేదు. అంతేకాకుండా మృణాల్ ఠాకూర్ రాపర్ బాద్షాతో ఎక్కువగా సన్నిహితంగా మెదలడంతో వీరిద్దరి మధ్య కూడా రిలేషన్ ఉన్నట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ ఈ పుకార్లను రాపర్ బాద్షా తోసిపుచ్చారు. మేమిద్దరం ప్రేమలో లేమని కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకు మృణాల్ ఠాకూర్ పేరు సిద్ధాంత్ చతుర్వేదితో ఎక్కువగా వినిపించింది.
ముఖ్యంగా వీరిద్దరూ బహిరంగ సభల్లో కూడా చాలా సన్నిహితంగా మెదలడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే పుకారు వైరల్ అయ్యాయి. ఇక టాలీవుడ్ లోకి వచ్చాక నటుడు సుమంత్ తో మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉందని రూమర్స్ వినిపించాయి. ముఖ్యంగా వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలను వాళ్ళు ఖండించారు. ఇక వీళ్లందరితోపాటు భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తో కూడా డేటింగ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు వినిపించాయి.కానీ వీరిద్దరి వైపు నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో ఈ బజ్ ఇలాగే క్రియేట్ అయింది. అలా ఫైనల్ గా మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ నటుడు ధనుష్ తో ప్రేమలో ఉందని ఫిబ్రవరి 14న పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు పుకార్లు వైరల్ అవుతున్నాయి. అలా మృణాల్ ఠాకూర్ ఇండస్ట్రీకి వచ్చినప్పటినుండి ఏడుగురితో రిలేషన్ పెట్టుకున్నట్టు పుకార్లు వినిపించాయి. ఇప్పుడు ధనుష్ పేరు కూడా చేయడంతో నెంబర్ 8 కి చేరింది.