6వ రోజు హైయెస్ట్ వసూళ్లను రాబట్టిన టాప్ 5 మూవీస్ ఇవే.. ఆ ప్లేస్ లో మన శంకర వరప్రసాద్ గారు..?

Pulgam Srinivas
విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీలు ఏవి ..? అందులో తాజాగా విడుదల అయిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ఏ స్థానంలో నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.

పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 14.05 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కాయి.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా ఇప్పటికే బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఈ సినిమా విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 13.86 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను రాబట్టిన సినిమాలలో రెండవ స్థానంలో నిలిచింది.

రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ కి విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.54 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సరిలేరు నీకెవ్వరు సినిమాకు విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 952 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అలా వైకుంఠపురంలో సినిమాకు విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.44 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: