దురంధర్ 2: అదిరిపోయే గుడ్ న్యూస్.. టీజర్ డేట్ లాక్..?
మార్చిలో విడుదల కాబోతున్న ఈ క్రేజీ సీక్వెల్ కి సైతం టీజర్ అప్డేట్ కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగానే ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి దురంధర్ పార్ట్ 1 ముగింపులో చూపించిన చిన్న గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ టీజర్ కోసం కూడా అభిమానులు చాలా ఆత్రుతగానే ఎదురు చూస్తున్నారు. తాజాగా బాలీవుడ్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దురంధర్ 2 టీజర్ రిలీజ్ డేట్ ఖరారు అయినట్లుగా వినిపిస్తోంది. జనవరి 23వ తేదీన సన్నీ డియోల్ నటించిన మోస్ట్ అవైడెడ్ చిత్రం బోర్డర్ 2.ఈ సినిమా థియేటర్లలో ఈ టీజర్ ని ప్రదర్శించబోతున్నట్లు వినిపిస్తోంది.
గతంలో చూపించిన కంటెంట్ ని మరికొంత అటాచ్ చేసి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. అటు థియేటర్లలోను ,సోషల్ మీడియాలో కూడా ఒకేసారి టీజర్ ని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ బ్లాక్ బాస్టర్ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి. దురంధర్ చిత్రం 43వ రోజు ముగిసేసరికి ఇండియా మొత్తం రూ. 871.9 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. రోజురోజుకి ఈ సినిమా మరింత బలంగా దూసుకు వెళ్తే కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమా పైన ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తున్నారు.