చిరంజీవి సినిమాలో ఆ క్రేజీ హీరోనా..? ఈ బాబీ ధియేటర్స్ తగలబెట్టేసేలా ఉన్నాడే..!?

Thota Jaya Madhuri
మెగాస్టార్ చిరంజీవి అంటేనే బాక్సాఫీస్ వద్ద ఓ ప్రత్యేకమైన బ్రాండ్. ఆయన పేరు తెరపై పడితే చాలు… థియేటర్లు పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటాయి. అలాంటి చిరంజీవి తాజాగా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఘన విజయం సాధించడంతో అభిమానుల్లో ఆనందం అంతా ఇంతా కాదు. చాలా రోజుల తర్వాత చిరంజీవికి సాలిడ్ హిట్ రావడంతో ఇండస్ట్రీ మొత్తం ఈ విజయాన్ని ప్రత్యేకంగా గమనిస్తోంది. థియేటర్లలో అభిమానుల హంగామా, రికార్డు స్థాయి కలెక్షన్లు, సోషల్ మీడియాలో ట్రెండింగ్ పోస్టులు… అన్నీ కలిపి మెగాస్టార్ మేనియా మళ్లీ పీక్ స్టేజ్‌కి చేరిందనే చెప్పాలి.

ఈ సినిమా సక్సెస్‌తో చిరంజీవి మరోసారి నిరూపించారు – వయసుతో సంబంధం లేకుండా స్టార్‌డమ్ అంటే ఏంటో. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మాస్ ప్రేక్షకుల వరకూ అన్ని వర్గాల నుంచి సినిమాకు మంచి స్పందన రావడం నిర్మాతలకు కూడా భారీ ఊరటనిచ్చింది. ఈ నేపథ్యంలో చిరంజీవి తన తదుపరి సినిమాలపై పూర్తి ఫోకస్ పెట్టారని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే బాబీకి మాస్ నాడి బాగా తెలుసు, చిరంజీవికి మాస్ అంటే ప్రాణం. ఈ ఇద్దరి కలయిక అంటే థియేటర్లు తగలబడాల్సిందే అన్న అంచనాలు మొదటి నుంచే ఉన్నాయి.ఇదిలా ఉండగా… ఈ చిరంజీవి – బాబీ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే… ఈ సినిమాలో ఓ సర్‌ప్రైజ్ గెస్ట్ రోల్ ఉండబోతుందట. గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్సులు ఎంత హైలైట్ అయ్యాయో తెలిసిందే. అదే తరహాలో బాబీ కూడా తన సినిమాలో ఓ యంగ్ హీరోను ప్రత్యేక పాత్రలో చూపించాలని ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్.

సినిమా సెకండ్ హాఫ్‌లో సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ గెస్ట్ రోల్ ఉండబోతుందని సమాచారం. ఈ పాత్ర మొత్తం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో నడుస్తుందట. కథకు కీలకమైన మలుపు ఇచ్చే పాత్రగా దీనిని డిజైన్ చేస్తున్నారట బాబీ. చిరంజీవి పాత్రకు ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎమోషనల్‌గా బలమైన లింక్‌ను ఇచ్చేలా ఈ గెస్ట్ క్యారెక్టర్ ఉండబోతుందన్నది టాక్.ఇప్పటికే ఈ పాత్ర కోసం తమిళ స్టార్ హీరో కార్తీ పేరు వినిపించింది. కార్తీకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండటంతో, ఈ క్యారెక్టర్‌కు ఆయన అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతారని చాలామంది భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం… బాబీ ఇప్పుడు పూర్తిగా తెలుగు యంగ్ హీరోను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. తెలుగు ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యేలా ఈ పాత్రను డిజైన్ చేయాలన్నదే దర్శకుడి ఆలోచనగా తెలుస్తోంది.

అయితే ఆ యంగ్ హీరో ఎవరు అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఇండస్ట్రీలో ఉన్న టాప్ యంగ్ హీరోల పేర్లు సోషల్ మీడియాలో గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వినిపిస్తున్న పేరు మాత్రం విజయ్ దేవర కొండ. మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం అంటే ఎవరికైనా లక్కే. అందుకే ఈ గెస్ట్ రోల్ కోసం యంగ్ హీరోలు ఆసక్తిగా ఉన్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. కానీ ఈ రోల్ కోసం బాబీ..విజయ్ దేవరకొండని సెలక్ట్ చేసుకున్నారు అంటూ ఓ న్యూస్ బయటకి వచ్చింది. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ విషయానికి వస్తే… చిరంజీవి – బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి మొదటి వారంలో అధికారికంగా ప్రారంభం కానుందని సమాచారం. ప్రీ–ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయట. కథ, స్క్రిప్ట్, లుక్స్ విషయంలో బాబీ చాలా కేర్ తీసుకుంటున్నారని, చిరంజీవి కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

మొత్తానికి చూస్తే… చిరంజీవి తాజా హిట్‌తో వచ్చిన జోష్, బాబీ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా, అందులో గెస్ట్ రోల్ రూమర్స్—అన్ని  కలిపి ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మరి ఆ ఫ్లాష్‌బ్యాక్ గెస్ట్ రోల్‌కు విజయ్ దేవరకొండ ఫైనల్ అవుతాడో, బాబీ ఏ సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.మెగాస్టార్ మేనియా ఏ మాత్రం తగ్గలేదు… ఈసారి థియేటర్లు నిజంగానే తగలబడేలా ఉన్నాయనే చెప్పాలి!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: