నా తిక్క కుదిర్చడానికే పవన్ కళ్యాణ్ వదిలేసాడు.. రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్.!

Pandrala Sravanthi
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ ల ఇద్దరిదీ ప్రేమ వివాహం అని తెలుసు. ఆ తర్వాత గొడవల కారణంగా విడిపోయారని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ విడాకులు తీసుకొని ఎవరి జీవితం వారు లీడ్ చేస్తున్నప్పటికీ ప్రతిసారి రేణు దేశాయ్ ని వేలె త్తి చూపుతూ రేణు దేశాయ్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముసుగులో ఉన్న వాళ్లు.. అయితే రీసెంట్గా రేణు దేశాయ్ కుక్కల్ని ఎందుకు అలా చంపేస్తున్నారు.అన్ని కుక్కలు అలాంటి కుక్కలు కావు. కొన్ని మంచి కుక్కలు కూడా ఉంటాయి. మీకు అంతలా కుక్కల్ని చంపాలనిపిస్తే కుక్కలు నచ్చకపోతే నా ఎన్జీవో కి కాల్ చేయండి.నేను వచ్చి కుక్కల్ని తీసుకొని వెళ్తా అంటూ చెప్పుకొచ్చింది. 


అయితే రేణుదేశాయ్ చేసిన కామెంట్స్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ నీకు అంత ప్రేమ ఉంటే మీ ఇంట్లో పెట్టుకో.. నీ బిడ్డ ప్రాణం పోతే నీకు తెలుస్తుంది మనుషుల విలువ ప్రాణాల విలువ అంటూ కొంతమంది నెగటివ్ కామెంట్లు చేశారు.అంతేకాదు నిన్ను అందుకే  పవన్ కళ్యాణ్ వదిలించుకున్నాడు. నీకు తిక్క ఉంది అంటూ కామెంట్లు చేశారు. ఇక ఈ కామెంట్లపై తాజాగా రేణు దేశాయ్ స్పందిస్తూ..నేను కుక్కల సంరక్షణ గురించి మాట్లాడితే మీరు నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు. నాకు తిక్క ఉంది పవన్ కళ్యాణ్ అందుకే వదిలేసాడంటూ మాట్లాడుతున్నారు. కుక్కల గురించి పోరాటం చేస్తే నాకేమీ డబ్బులు రావు. నేను మనుషుల లైఫ్ గురించి పోరాటం చేస్తున్నాను.


మీ పిల్లలకి కుక్క కరిచి చనిపోతే మీకు ఆ బాధ తెలుస్తుంది అంటున్నారు.నా పిల్లల ప్రాణం గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది. అయినా ఏ బిడ్డ ప్రాణమైన ఒక్కటే.. కుక్కలతో ఇబ్బంది ఉంటే నా ఎన్జీవో కి కాల్ చేయండి. అంతేకానీ నా పిల్లల ప్రాణం గురించి నా పిల్లల గురించి మాట్లాడకండి. నా పర్సనల్ లైఫ్ గురించి తీయకండి అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. అలాగే తాను రాజకీయాల్లోకి వస్తున్నాను అనే వార్తలు కూడా అవాస్తవమని..అదంతా వట్టి పుకారేనని, నేను ఏ రాజకీయ పార్టీలో చేరను ఎప్పటికీ చేరబోను అంటూ క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: