విజయ్ దేవరకొండతో రష్మిక పెళ్లి ఆగిపోయిందా..? సెన్సేషనల్ వీడియో వైరల్..!
ఈ క్రమంలోనే ఇటీవల వీరి ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా వివాహం జరగబోతుందన్న వార్తలు కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రూమర్స్‌కు సంబంధించి ఇప్పటివరకు ఈ జంట ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.ఇదిలా ఉండగా, తాజాగా రష్మిక మందన్న ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ ఇంటర్వ్యూలో ఆమెను మ్యారేజ్ రూమర్స్ గురించి ప్రశ్నించగా రష్మిక స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె మాట్లాడుతూ, “గత నాలుగేళ్లుగా నా పెళ్లి గురించి ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. నిజం చెప్పాలంటే, పెళ్లి గురించి మాట్లాడే సరైన సమయం వచ్చినప్పుడే నేను స్పందిస్తాను. ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా అందరికీ చెబుతాను” అని చెప్పుకొచ్చింది.
ఈ సమాధానం తర్వాత యాంకర్ సరదాగా, “మనం మంచి ఫ్రెండ్స్ కదా, ఇప్పుడైనా చెప్పొచ్చు కదా?” అని ప్రశ్నించగా, రష్మిక నవ్వుతూ, “ఆఫ్ కెమెరా అయితే అడుగు… చెబుతాను. కానీ ఇక్కడ మాత్రం చెప్పలేను” అంటూ సమాధానం ఇచ్చింది. ఈ ఒక్క మాటతోనే మళ్లీ కొత్త రూమర్స్ మొదలయ్యాయి.ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కొంతమంది అభిమానులు రష్మిక మాటలను పాజిటివ్‌గా తీసుకుంటూ, “సరైన సమయం వచ్చినప్పుడు పెళ్లి ప్రకటిస్తారు” అని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం “ఇద్దరి మధ్య ఏదో తేడా వచ్చిందా?”, “పెళ్లి ఆగిపోయిందా?” అంటూ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి.
అయితే సినీ పరిశ్రమకు చెందిన పలువురు మాత్రం ఈ రూమర్స్‌పై స్పందిస్తూ, సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాన్ని బయటకు చెప్పాల్సిన అవసరం లేదని, వారు చెప్పేంత వరకు ఊహాగానాలకు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ ప్రస్తుతం తమ కెరీర్ పీక్స్‌లో ఉన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో వ్యక్తిగత విషయాలపై మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.మొత్తానికి విజయ్ – రష్మికల మధ్య ఉన్న బంధం ఏంటన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. డేటింగ్, ఎంగేజ్మెంట్, పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ పుకార్లుగానే భావించాల్సి ఉంటుంది. అయితే ఒక విషయం మాత్రం ఖాయం… ఈ జంట పేరు వినిపించిన ప్రతిసారీ టాలీవుడ్‌లోనూ, సోషల్ మీడియాలోనూ ఆసక్తి మాత్రం తగ్గడం లేదు.