ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్..చూపులతోనే గుండెల్లో మంట రేపుతున్న రాశీ ఖన్నా...!
ప్రస్తుతం రాశి ఖన్నా ఆశలన్నీ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా పైనే ఉన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రాశి 'శ్లోక' అనే పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు వచ్చింది. పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన గౌరవంగా భావిస్తున్నానని రాశి ఇటీవల ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టింది. ఈ చిత్రం 2026 ఫిబ్రవరి 14న (వాలెంటైన్స్ డే) గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సినిమా హిట్ అయితే రాశి మళ్ళీ టాలీవుడ్ నంబర్ వన్ రేసులోకి రావడం ఖాయం.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాశి ఖన్నా తన కెరీర్ ప్లానింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. "ఇకపై నేను దిగజారిపోయే పాత్రలు చేయను. నాకు కంఫర్ట్‌గా ఉండే, నటనకు స్కోప్ ఉన్న పాత్రలనే ఎంచుకుంటాను" అని తెగేసి చెప్పింది. దీనివల్ల ఆమె ఒక సీనియర్ స్టార్ హీరో పక్కన వచ్చే భారీ ఆఫర్‌ను కూడా వదులుకుందని టాక్. కేవలం రెమ్యూనరేషన్ కోసం కాకుండా, కంటెంట్ కోసం ఆమె పడుతున్న తపన చూసి ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.
రాశి ఖన్నా కేవలం వెండితెరకే పరిమితం కాలేదు. 'ఫర్జీ (Farzi)', 'రుద్ర' వంటి వెబ్ సిరీస్‌లతో నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. షాహిద్ కపూర్, అజయ్ దేవగన్ వంటి స్టార్ల పక్కన ఆమె నటనకు బాలీవుడ్ ఫిదా అయ్యింది. సిద్ధు జొన్నలగడ్డ సరసన నటిస్తున్న 'తెలుసు కదా' సినిమాలో రాశి పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతోందని సమాచారం. ఈ సినిమా కోసం ఆమె తన లుక్ ను కూడా మార్చుకుంది.ఒక యాక్షన్ ప్రాజెక్ట్ కోసం గాయాలైనా లెక్కచేయకుండా రాశి చేస్తున్న ట్రైనింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె డెడికేషన్ చూస్తుంటే ఫ్యూచర్లో మరిన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు రావడం పక్కా!
కెరీర్ మొదట్లో రాశి ఖన్నా తన బరువు విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. కొందరు ఆమెను 'గ్యాస్ ట్యాంకర్' అని పిలుస్తూ వెక్కిరించేవారు. కానీ, అవేమీ పట్టించుకోకుండా పట్టుదలతో తన ఫిజిక్ ను మార్చుకుని అందరి నోళ్లు మూయించింది. "నేను నా కోసం మారాను, ఎవరాశి ఖన్నా ఇప్పుడు ఒక సెటిల్డ్ నటి. ఆమెకు అందం ఉంది, అభినయం ఉంది, అన్నిటికీ మించి 'ప్యాషన్' ఉంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాతో ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. 2026 సంవత్సరం రాశి ఖన్నాకు టాలీవుడ్ లో మరో 'గోల్డెన్ ఇయర్' కాబోతోంది.రినో మెప్పించడానికి కాదు" అని ఆమె చెప్పిన మాటలు ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తున్నాయి.