చిరంజీవితో సినిమా అందుకే చేయలేదు..ఓపెన్ అయినా బోయపాటి..?

Divya
టాలీవుడ్ డైరెక్టర్లలో డైరెక్టర్ బోయపాటి శ్రీను మాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. గత ఏడాది బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు బోయపాటి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బోయపాటి శ్రీను మాట్లాడుతూ చిరంజీవితో సినిమా ఎందుకు తీయలేదని విషయం పైన స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే తన సినిమాలకు సంబంధించి కొన్ని కీలకమైన విషయాలను తెలియజేశారు.



బోయపాటి శ్రీను మాట్లాడుతూ తాను తీసిన సినిమాలను పూర్తిగా ఫైనల్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాతే తాను చూస్తానని అలా చూసిన తర్వాతే  ఎవరికైనా చూపిస్తానని తెలియజేశారు. అలా అల్లు అర్జున్ తో తీసిన సరైనోడు సినిమా చివరి వరకు అల్లుఅరవింద్ కు కూడా చూపించలేదు. ఫైనల్ ఎడిటింగ్ పూర్తి అయిన తర్వాత స్క్రీన్ ప్లే ప్రకారం అన్ని సీన్లను ఒకే గొలుసుకు కట్టినట్టుగా అమర్చిన తర్వాతే ఒక సరైన అభిప్రాయం రాగలమనే నమ్మకం ఉంటుందని తెలిపారు. కేవలం కొన్ని సీన్లు చూస్తే వాటి మధ్య ఉండే అనుసంధానం ఎవరికీ అర్థం కాదనే అభిప్రాయం తనకు ఉందని తెలిపారు.


ఈ విషయంలో పూర్తిగా డైరెక్టర్ కె స్వేచ్ఛ ఇవ్వాలి ,ఫైనల్ ఎడిటింగ్ పూర్తి అయిన తర్వాత సినిమాని మిగిలిన వారికి చూపించినప్పుడు ఏవైనా మార్పులు చేయవలసి వస్తే అవి ఎక్కడ? ఎందుకు చేయాలనే విషయంపై స్పష్టత ఉంటుందని తెలిపారు. ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి వాటిని మార్చండి , వీటిని మార్చండి అని చెబితే నాకు నచ్చదు.. తాను కూడా ప్రతి సీన్ లింక్ చేసి సినిమాను తీస్తానని తెలిపారు. ఇక చిరంజీవితో సినిమా చేయకపోవడానికి ఏవైనా కారణాలు ఉన్నాయా అని ప్రశ్నించగా?  చిరంజీవి గారితో చేయడానికి తన దగ్గర సరైన కథ లేదని ,ఒకవేళ అలాంటి కథ ఆయనకు నచ్చి నాకు దొరికితే మాత్రం కచ్చితంగా చేయగలనని తెలియజేశారు బోయపాటి శ్రీను.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: