కోటి రూపాయలు ఇస్తామన్నా..హిట్ అవుతుంది అని తెలిసినా..మెగా హీరోతో సినిమా రిజెక్ట్ చేసిన క్రేజీ బ్యూటీ.. ఎందుకంటే..?

Thota Jaya Madhuri
టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుకుని రామ్ చరణ్ వరకూ, మెగా కుటుంబానికి చెందిన హీరోలతో ఒక్క సినిమా చేసినా సరే, హీరోయిన్స్‌కు భారీ పాపులారిటీ వస్తుందనేది ఇండస్ట్రీలో ఓ ఓపెన్ సీక్రెట్. అందుకే మెగా హీరోల సినిమాలంటే హీరోయిన్స్ ముందువరుసలో నిలబడతారు. కెరీర్‌లో ఒక మెగా హీరో సినిమా పడితే చాలు, ఆ తర్వాత అవకాశాల వరద వస్తుందని చాలా మంది నమ్ముతుంటారు.అలాంటి పరిస్థితుల్లో, ఓ క్రేజీ మెగా హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చినా కూడా ఒక సీనియర్ హీరోయిన్ ఆ ఆఫర్‌ను తిరస్కరించిందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు… టాలీవుడ్‌లో పవర్‌ఫుల్ రోల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రమ్యకృష్ణ.

తాజా సమాచారం ప్రకారం, మెగా హీరో రామ్ చరణ్‌ కి తల్లి పాత్రలో పెద్ది సినిమాలో కలిసి నటించే ఒక కీలక పాత్ర కోసం రమ్యకృష్ణను మేకర్స్ సంప్రదించారట.  అయితే ఆ పాత్ర ఆమెకు అంతగా నచ్చలేదని, క్యారెక్టర్‌లో సరైన బలం, ప్రాధాన్యత లేదని భావించి ఆ ఆఫర్‌ను రమ్యకృష్ణ తిరస్కరించిందన్న టాక్ వినిపిస్తోంది. ఇది తెలిసిన వెంటనే అభిమానుల్లో చర్చ మొదలైంది.సాధారణంగా చూస్తే, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా అంటే చాలా మంది నటీమణులు ఎలాంటి ఆలోచన లేకుండా ఒప్పుకుంటారు. కానీ రమ్యకృష్ణ మాత్రం మొదటి నుంచి తన కెరీర్‌లో ఒకే స్టాండ్‌లో ఉంది. హీరో ఎవరు అన్నది కాదు, తన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంది అన్నదే ఆమెకు ముఖ్యమని మరోసారి రుజువైంది.

రమ్యకృష్ణ కెరీర్‌ను పరిశీలిస్తే, ఆమె చేసిన పాత్రలన్నీ బలమైన వ్యక్తిత్వంతో, కథలో కీలకంగా నిలిచినవే. ‘నీలాంబరి’ లాంటి పాత్రతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన ఆమె, చిన్న పాత్ర అయినా సరే క్యారెక్టర్‌లో డెప్త్ లేకపోతే అంగీకరించదు అనే పేరు తెచ్చుకుంది. అందుకే స్టార్ హీరో సినిమా అయినా సరే, తన పాత్ర కథకు విలువ జోడించకపోతే ఆమె నో చెప్పడంలో ఎప్పుడూ వెనకాడదు.ఈ నేపథ్యంలో, రామ్ చరణ్ సినిమాను రమ్యకృష్ణ రిజెక్ట్ చేసిందన్న వార్త నిజమైతే, అది ఆమె ప్రొఫెషనలిజం, సెలెక్టివ్ నేచర్‌కు మరో ఉదాహరణగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మెగా హీరో సినిమా కాబట్టి ఒప్పుకోవాలి అన్న ఆలోచన రమ్యకృష్ణకు ఎప్పుడూ లేదని, పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఫాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి, ఈ వార్త నిజమైనా కాకపోయినా, రమ్యకృష్ణ మాత్రం క్యారెక్టర్ ఓరియెంటెడ్ నటిగా, స్టార్ హీరోల సినిమాలకూ భయపడకుండా తనకు నచ్చిన పాత్రలకే ఓకే చెప్పే నటిగా మరోసారి వార్తల్లో నిలిచింది. టాలీవుడ్‌లో ఇలాంటి స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకునే నటీమణులు చాలా అరుదు అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: