మళ్లీ ఆ తెలుగు హీరోతో సమంత సినిమా.. ఫ్యాన్స్ కి ఫుల్ ప్లేట్ బిర్యానీ తిన్న కిక్ ఇచ్చే న్యూస్..?!

Thota Jaya Madhuri
సమంత అభిమానులకు ఇది నిజంగా వెరీ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పాల్సిందే. హీరోయిన్ సమంత మరోసారి ఒక స్టార్ తెలుగు హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో, ఫ్యాన్ పేజీల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.ఇటీవలే తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన సమంత, మ్యారేజ్ లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాల విషయంలో కూడా ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా ముందుకెళ్తోంది. ఒక పక్క ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ, మరో పక్క కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టిన సమంత, ప్రస్తుతం “మన ఇంటి బంగారం” సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా షూట్‌తో పాటు వరుస ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తన స్టామినా ఏంటో మరోసారి నిరూపిస్తోంది.

ఇలాంటి సమయంలో సమంత మరోసారి ఒక టాప్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందనే వార్త రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అందుతున్న తాజా సమాచారం ప్రకారం, స్టార్ డైరెక్టర్  లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఒక భారీ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రావడం జరిగింది. భారీ బడ్జెట్‌తో, పవర్‌ఫుల్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని ఇండస్ట్రీ టాక్.ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే… ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సమంతను ఎంపిక చేసినట్టు సమాచారం. లోకేష్  ఈ క్యారెక్టర్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసి, ఆ పాత్రకు సమంత అయితేనే పర్ఫెక్ట్ అని భావించారట. అంతేకాదు, ఈ పాత్ర కోసం సమంతను ప్రత్యేకంగా ఒప్పించారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కథ, క్యారెక్టర్‌కు ఉన్న ప్రాముఖ్యత, స్క్రీన్ స్పేస్ అన్నీ కూడా సమంతకు బాగా నచ్చడంతో ఆమె ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్టు టాక్.

ఇదే గనుక నిజమైతే, అల్లు అర్జున్ – సమంత కాంబినేషన్ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఈ ఇద్దరి మధ్య వచ్చిన స్క్రీన్ ప్రెజెన్స్‌కు అభిమానులు ఎంతగా ఫిదా అయ్యారో తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమాలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్ ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది.అంతకుముందు వీరిద్దరూ కలిసి చేసిన సినిమాల సీన్స్, స్క్రీన్ షాట్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటాయి. ఇప్పుడు మరోసారి అదే జోడీ స్క్రీన్‌పై కనిపించబోతోందన్న వార్త రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఫ్యాన్ పేజీల్లో ఇప్పటికే పోస్టులు, ఎడిట్స్, స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి.

మొత్తానికి చూస్తే, సమంత తన వ్యక్తిగత జీవితం మరియు సినీ జీవితం రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేస్తూ, కెరీర్‌లో మరో స్ట్రాంగ్ ఫేజ్‌లోకి అడుగుపెడుతోందని చెప్పవచ్చు. అల్లు అర్జున్‌తో మరోసారి స్క్రీన్ షేర్ చేస్తే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా భారీ అంచనాల మధ్య విడుదలవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అధికారికంగా ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉన్నా, ప్రస్తుతం వినిపిస్తున్న ఈ వార్త మాత్రం సమంత అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: