సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన అనేక సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. సంక్రాంతి పండుగ సమయంలో తెలుగు ప్రేక్షకులు సినిమాలు చూడడానికి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. దానితో సినిమాలకు మంచి కలెక్షన్లు కూడా వస్తూ ఉంటాయి. ఇలా సినిమాలకు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉండడంతో అనేక సినిమాలను మేకర్స్ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేస్తూ ఉంటారు. ఇకపోతే కొంత మంది హీరోలా దర్శకుల , నిర్మాతల సినిమాలు ఎక్కువ శాతం సంక్రాంతి పండుగకు విడుదల అవుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇద్దరు హీరోయిన్ల సినిమాలు కూడా సంక్రాంతి సినిమాలకి ఎక్కువ శాతం విడుదల అవుతూ ఉన్నాయి. ఇక ఆ సినిమాలతో వారు మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకుంటున్నారు. ఇంతకు ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు అనుకుంటున్నారా ..? వారు మరెవరో కాదు మీనాక్షి చౌదరి , ఆశిక రంగనాథ్.
2024 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా రూపొందిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక 2025 వ సంవత్సరం ఈ బ్యూటీ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తాజాగా 2026 వ సంవత్సరం ఈ బ్యూటీ నటించిన అనగనగా ఒక రాజు సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని ఇప్పటికే సొంతం చేసుకుంది. ఇక 2024 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఆశిక రంగనాథ్ హీరోయిన్గా రూపొందిన నా సామి రంగ అనే సినిమా విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక 2026 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ బ్యూటీ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా విడుదల అయింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి టాక్ వచ్చింది. ఇలా ఇద్దరు బ్యూటీలు నటించిన సినిమాలు సంక్రాంతి పండక్కి విడుదల అయ్యి మంచి క్రేజ్ ను దక్కించుకుంటున్నాయి.