నెక్స్ట్ సంక్రాంతికి అనీల్ రావిపూడి సర్‌ప్రైజ్! ఊహించని హీరో ఎవరు?
తాజా ఫిలిం నగర్ టాక్ ప్రకారం, అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని విశ్వక్ సేన్ (Vishwak Sen) తో చేయబోతున్నాడట.విశ్వక్ సేన్ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన బాడీ లాంగ్వేజ్‌కు, అనిల్ రావిపూడి రాసే కామెడీ టైమింగ్‌కు పక్కాగా సెట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.ఈ సినిమాను 2026 మధ్యలో ప్రారంభించి, 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనిల్ ప్లాన్ చేస్తున్నాడట. అనిల్‌కు సంక్రాంతి సీజన్ అంటే చాలా ఇష్టం, అందుకే ఈ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయబోతున్నాడు.
మరోవైపు, అనిల్ రావిపూడి మళ్ళీ తన ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేష్ తో ఒక భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. 'ఎఫ్ 3' తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ వస్తే చూడాలని ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. అయితే, విశ్వక్ సేన్ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్లు సమాచారం.అనిల్ రావిపూడి సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది."హీరోకు ఒక వింత మేనరిజం పెట్టడం, కడుపుబ్బ నవ్వించే డైలాగులు రాయడం అనిల్ స్పెషాలిటీ. విశ్వక్ సేన్ లాంటి మాస్ హీరోను అనిల్ ఎలా ప్రెజెంట్ చేస్తాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది."వరుస హిట్లతో ఉన్న అనిల్ రావిపూడి, ఈ సినిమాతో హ్యాట్రిక్ కాదు కదా.. ఏకంగా డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని కసిగా ఉన్నాడు. భారీ బడ్జెట్‌తో, ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోందని టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని తెలుస్తోంది.
మెగాస్టార్‌తో చేసిన 'శంకర వరప్రసాద్ గారు' సినిమాలో చిరును ఎంత ఎనర్జిటిక్‌గా చూపించారో, నెక్స్ట్ హీరోను కూడా అదే రేంజ్‌లో చూపిస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ముఖ్యంగా అనిల్ రావిపూడి సినిమాల్లో ఉండే ఐటెం సాంగ్స్, మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో కూడా పీక్స్‌లో ఉండబోతున్నాయట.మొత్తానికి అనిల్ రావిపూడి తన సంక్రాంతి అడ్డాను వదిలేలా లేడు. ఒకవైపు 'శంకర వరప్రసాద్' వసూళ్ల వర్షం కురిపిస్తుంటే, మరోవైపు నెక్స్ట్ సినిమా కోసం గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నాడు. విశ్వక్ సేన్ లేదా మరో స్టార్ హీరో ఎవరైనా సరే.. అనిల్ రావిపూడి సినిమా అంటే థియేటర్లలో నవ్వుల జాతర గ్యారెంటీ!