షారుఖ్ ఖాన్ ధరించిన ఈ వాచ్ ఎన్ని కొట్లో తెలుసా..?
షారుఖ్ ఖాన్ ధరించిన వాచ్ సదాసీదాది కాదు. చాలా తక్కువ మంది దగ్గరే అలాంటి వాచ్ కలదు. ఈ వాచ్ ధర తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. షారుక్ ఖాన్ ధరించిన వాచ్ పేరు రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డైటోనా బ్లూ శఫైర్ ఈ వాచ్ ని కలెక్టర్ ఆఫ్ క్యాటలాగ్ పీస్ అని పిలుస్తుంటారు. రోలెక్స్ స్టోర్ కి వెళ్లి మరి ఈ వాచ్ కావాలి అంటే దొరకదు. ఈ కంపెనీ తమ అత్యంత విఐపి క్లైంట్లకు మాత్రమే చాలా రహస్యంగా చాలా తక్కువగా వీటిని తయారు చేయిస్తారు.
ఈ వాచ్ 40 mm వైట్ గోల్డ్ కేసుతో తయారుచేస్తారు. దీనిపైన ఏకంగా 54 వజ్రాలను అమరుస్తారు. ఈ వాచ్ చుట్టూ ఉన్న నీలిరంగు రాళ్లను బాగేట్ ఆకారంలో చాలా అందంగా రూపొందిస్తారు. వాచ్ లోపల ఉండే డయల్ వెండి రంగులో ఉంటుంది. అయితే ఇది కాంతి పడినప్పుడు రంగులు మారుతూ ఉంటుంది. ఈ వాచ్ విలువ అంచనా ప్రకారం రూ.15 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం. షారుఖ్ ఖాన్ ఈ వాచ్ ధరించడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో కూడా ఎన్నో సార్లు ఇలాంటి వాచ్ లను ధరించారు. ఈ వాచ్ ధర చూసి నేటిజన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.