అదిరిపోద్దీ సంక్రాంతి టైటిల్ తో అనిల్ రావిపూడి సినిమా.. హీరోలు వాళ్లేనా?

Reddy P Rajasekhar

టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం తన మార్కు వినోదంతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సీనియర్ హీరోలు అంటే అనిల్ రావిపూడికి ఉన్న అభిమానం అందరికీ తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం,  మన శంకర వరప్రసాద్ గారు నటించిన సినిమాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ దర్శకుడు, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న తెరకెక్కనున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా విడుదలకు ముందే దీనికి సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం ప్రకారం, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఒకరు 'అదిరిపోద్ది సంక్రాంతి' అనే టైటిల్‌ను ఫిల్మ్ చాంబర్‌లో రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. ఈ టైటిల్ వినగానే ఇది 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రానికి సీక్వెల్ అనే చర్చ మొదలైంది. అంతేకాకుండా, ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్‌తో పాటు దగ్గుబాటి రానా కూడా కలిసి నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. బాబాయ్-అబ్బాయ్ కలయికలో ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ వస్తే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అనిల్ రావిపూడి తన సినిమాల్లో మల్టీస్టారర్లను డీల్ చేయడంలో సిద్ధహస్తుడు కాబట్టి, ఈ ప్రాజెక్ట్ కచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం అనిల్ రావిపూడి తన పూర్తి దృష్టిని ఈ సినిమా స్క్రిప్ట్ పై పెట్టారని తెలుస్తోంది.  ఈ సినిమా ఫలితాన్ని బట్టి సీక్వెల్ పనులు పట్టాలెక్కే అవకాశం ఉంది. రానా,  వెంకటేష్ కాంబినేషన్ కుదిరితే మాత్రం అది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం ఖాయం. ఫిబ్రవరి నెలలో తన తదుపరి ప్రాజెక్టులకు సంబంధించి అనిల్ రావిపూడి ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పటి వరకు ఈ 'అదిరిపోద్ది సంక్రాంతి' ప్రాజెక్ట్ గురించిన మరిన్ని వివరాల కోసం అభిమానులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: