టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీ మణులలో ఒకరు అయినటువంటి నయనతార హీరోయిన్గా నటించగా ... విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. భీమ్స్ సిసిరిలీయో ఈ సినిమాకి సంగీతం అందించగా ... ఈ సినిమాను షైన్ స్క్రీన్ , గోల్డ్ బాక్స్ బ్యానర్లపై సాహు గారపాటి , సుష్మిత కొణిదల ఈ సినిమాను నిర్మించారు.
ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేశారు. ఈ సినిమాకు బుక్ మై షో లో చాలా రోజుల పాటు అద్భుతమైన రేంజ్ లో టికెట్స్ సేల్స్ జరిగాయి. ఇకపోతే ఈ వారం లో కొన్ని కొత్త సినిమాలు విడుదల కావడంతో బుక్ మై షో లో సేల్స్ పరంగా మన శంకర వర ప్రసాద్ గారు సినిమా కాస్త వెనకబడిపోయింది. ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో ఆప్ లో అత్యధిక టికెట్లు సేల్ అయినా సినిమాలలో మొదటి స్థానంలో బార్డర్ 2 మూవీ 208.8 కే తో మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా , చాత పచ్చ సినిమా 19.16 కే టికెట్లు సేల్ అయ్యి రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇకపోతే మన శంకర వర ప్రసాద్ గారు మూవీ కి సంబంధించిన 55.28 కే టికెట్లు ఆఖరి 24 గంటల్లో సేల్ అయ్యాయి. దానితో ఈ మూవీ బుక్ మై షో లో ఆఖరి 24 గంటల్లో అత్యధిక టికెట్లు సేల్ అయిన సినిమాల్లో మూడవ స్థానంలో నిలిచింది.