లాస్ట్ మినిట్ లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రాజమౌళి.."వారణాసి" పై అంచనాలు ట్రిపుల్..!?

Thota Jaya Madhuri
తెలుగు సినిమా ఇండస్ట్రీలో “డైరెక్టర్” అనే పదానికి నిజమైన అర్థం చెప్పాలంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఎస్.ఎస్. రాజమౌళి. ఆయనను కేవలం దర్శకుడిగా మాత్రమే చూడటం చాలా చిన్న విషయం. రాజమౌళి అంటే ఒక విజన్, ఒక ప్లానింగ్, ముఖ్యంగా ప్రేక్షకుల నాడి పట్టుకున్న మాస్టర్ మైండ్ అని చెప్పాలి. జనాలకు ఏం కావాలి, ఎలాంటి సీన్స్ పెడితే థియేటర్లలో విజిల్స్ పడతాయి, ఎలాంటి ఎమోషన్ టచ్ చేస్తే సినిమా గుర్తుండిపోతుంది అన్నది ఆయనకు అచ్చంగా తెలుసు.

అందుకే ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి సినిమా ఏదో ఒక రీతిలో రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాల నుంచి బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ వరల్డ్ సినిమాల వరకు ఆయన ప్రయాణం ప్రేక్షకులకు తెలిసినదే. అందుకే రాజమౌళి సినిమా అంటే కథ తెలియకపోయినా అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకుతాయి.ఇప్పుడు అలాంటి రాజమౌళి మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన కొత్త సినిమా “వారణాసి”తో మన ముందుకు రాబోతున్నాడనే వార్త ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండటం సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ అంటేనే ఫాన్స్‌కి పండగ వాతావరణం ఏర్పడింది.

ఇక హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటిస్తుందనే వార్త అధికారికంగా బయటకు రావడంతో ఈ ప్రాజెక్ట్‌కి ఇంటర్నేషనల్ రేంజ్ వచ్చేసింది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు ఉన్న ప్రియాంక చోప్రా ఈ సినిమాలో భాగం కావడం అంటే రాజమౌళి ప్లాన్ ఎంత భారీగా ఉందో అర్థమవుతుంది.అయితే ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే…ఈ సినిమాలో ఇంకొక స్పెషల్ హీరోయిన్ క్యారెక్టర్ ఉందనే న్యూస్ బయటకు రావడం. ఈ క్యారెక్టర్ గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లీక్ కాకుండా మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఆ హీరోయిన్ ఎవరు? ఆమె పాత్ర ఏంటి? కథలో ఆమె ఇంపార్టెన్స్ ఎంత? అన్న విషయాలు పూర్తిగా రహస్యంగా ఉంచుతున్నారు.

సాధారణంగా రాజమౌళి ఇలా సీక్రెట్‌గా ఉంచుతున్నాడంటే ఆ క్యారెక్టర్‌లో ఖచ్చితంగా భారీ విలువ ఉంటుందని ఫాన్స్ భావిస్తున్నారు. గతంలో కూడా రాజమౌళి ఇలాంటి సర్ప్రైజ్ ప్లానింగ్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే ఈసారి కూడా ఆయన మరో లెవెల్ సర్ప్రైజ్ రెడీ చేశాడని సోషల్ మీడియాలో చర్చలు జోరుగా జరుగుతున్నాయి.ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా మొత్తం వారణాసి సినిమా గురించే మాట్లాడుకుంటోంది. ఫాన్స్, సినీ విశ్లేషకులు, ట్రేడ్ వర్గాలు – అందరూ ఈ సీక్రెట్ హీరోయిన్ ఎవరు అన్నదానిపై ఊహాగానాలు చేస్తున్నారు. రాజమౌళి ఇచ్చే సర్ప్రైజ్‌లకు ఫాన్స్ కచ్చితంగా ఇంప్రెస్ అవుతారని ధీమాగా కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి చెప్పాలంటే, వారణాసి సినిమా ఇప్పటివరకు వచ్చిన న్యూస్‌తోనే అంచనాలను డబుల్, ట్రిపుల్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇంకా షూటింగ్ పూర్తి కాకముందే ఇంత హైప్ క్రియేట్ అవుతోందంటే, సినిమా రిలీజ్ టైమ్‌కి ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో ఊహించుకోవచ్చు. రాజమౌళి మళ్లీ ఒక చరిత్ర సృష్టించబోతున్నాడా? మహేష్ బాబు కెరీర్‌లో ఇది మరో మైలురాయిగా మారబోతుందా? అన్న ప్రశ్నలకు సమాధానం రావాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.కానీ ఒక విషయం మాత్రం క్లియర్…రాజమౌళి సినిమా అంటే సర్ప్రైజ్ ప్యాకేజే!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: