పెద్ది అవుట్.. ఉస్తాద్ ఇన్! టాలీవుడ్‌లో హాట్ టాక్...!

Amruth kumar
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఒకటే చర్చ.. మెగా వర్సెస్ మెగా! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాల మధ్య రిలీజ్ డేట్ వార్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మార్చి 27న రావాల్సిన చరణ్ ఒకవేళ వెనక్కి తగ్గితే, ఆ ఖాళీని భర్తీ చేయడానికి బాబాయ్ పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారన్న వార్త ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పిస్తోంది.మార్చి 27.. మెగా అభిమానులకు ఇది ఒక స్పెషల్ డే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా 'పెద్ది' సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ, షూటింగ్ అప్‌డేట్స్ చూస్తుంటే సీన్ మారుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ 'పెద్ది' వాయిదా పడితే, ఆ డేట్‌ను వదులుకోకుండా తన 'ఉస్తాద్ భగత్ సింగ్'తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి పవర్ స్టార్ రెడీ అవుతున్నారు.



బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న 'పెద్ది' ఒక భారీ స్పోర్ట్స్ డ్రామా.తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ ఇంకా 40 రోజుల వరకు బ్యాలెన్స్ ఉంది. రామ్ చరణ్ తన లుక్ కోసం పడుతున్న శ్రమ, విలేజ్ బ్యాక్‌డ్రాప్ సెట్స్ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని టీమ్ భావిస్తోంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, గ్రాఫిక్స్ పనులకు సమయం పట్టేలా ఉండటంతో, మార్చి 27 డెడ్ లైన్ అందుకోవడం కష్టమని టాక్ వినిపిస్తోంది. అందుకే రిస్క్ తీసుకోకుండా సినిమాను సమ్మర్ రేసులోకి నెట్టే ఆలోచనలో ఉన్నారట.



ఒకవైపు 'పెద్ది' డైలమాలో ఉంటే, పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మాత్రం స్పీడ్ పెంచింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 'పెద్ది' మరియు 'ఉస్తాద్' రెండింటికీ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ భాగస్వాములుగా ఉండటంతో, ఒకవేళ చరణ్ సినిమా రాకపోతే ఆ స్లాట్‌ను పవన్ కళ్యాణ్‌కు ఇవ్వాలని వారు డిసైడ్ అయినట్లు సమాచారం.'గబ్బర్ సింగ్' తర్వాత పవన్-హరీష్ కాంబో కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, పాటలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.మార్చి 27 అంటే చరణ్ పుట్టినరోజు మాత్రమే కాదు, అది ఉగాది పండగ సీజన్ కూడా. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఏ హీరో అయినా ఆ డేట్‌పై కన్నేస్తారు. చరణ్ తప్పుకుంటే, ఆ క్రేజీ డేట్‌ను పవర్ స్టార్ కంటే పవర్‌ఫుల్‌గా ఎవరూ భర్తీ చేయలేరు.ఒకవేళ ఈ మార్పు జరిగితే మెగా ఫ్యాన్స్‌కు వచ్చే నష్టం ఏమీ లేదు.



"చరణ్ రాకపోయినా, బాబాయ్ వచ్చి బాక్సాఫీస్ దగ్గర 'గ్లాస్' పగులగొడితే ఆ కిక్కే వేరు!" అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.అయితే, ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, ఫిబ్రవరి మొదటి వారంలో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.మొత్తానికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మార్చి నెల చాలా ఇంట్రెస్టింగ్‌గా మారబోతోంది. చరణ్ 'పెద్ది'గా వచ్చి తన మార్క్ చూపిస్తాడా? లేక 'ఉస్తాద్'గా పవన్ కళ్యాణ్ వచ్చి రికార్డుల వేట మొదలుపెడతాడా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఏది ఏమైనా, మార్చి 27న థియేటర్ల దగ్గర మెగా జాతర మాత్రం పక్కా!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: