మెగా డాటర్ నిర్ణయం షాక్.. గ్రాండ్ ప్రిపరేషన్స్ స్టార్ట్?
ఈ సినిమా విజయం మెగా కుటుంబంలో ఒకరికి చాలా ప్రత్యేకం.. ఆమే సుస్మిత కొణిదెల. మెగాస్టార్ పెద్ద కుమార్తెగా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా అందరికీ తెలిసిన సుస్మిత, ఈ చిత్రంతో పూర్తిస్థాయి నిర్మాతగా (గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్) టాలీవుడ్‌కు పరిచయమయ్యారు.నిర్మాతగా తన మొదటి సినిమాతోనే ₹300 కోట్ల మార్కును అందుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. తండ్రి ఇమేజ్‌ను కాపాడటమే కాకుండా, ఒక కమర్షియల్ సక్సెస్‌ను డెలివరీ చేయడంలో సుస్మిత సక్సెస్ అయ్యారు. "నా కూతురు నిర్మాతగా చేసిన మొదటి సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడం నాకు గర్వంగా ఉంది" అని చిరంజీవి సక్సెస్ మీట్‌లో ఎమోషనల్ అయ్యారు.
సీనియర్ హీరోలలో ₹300 కోట్ల గ్రాస్ వసూలు చేయడం అంటే అది ఒక్క చిరంజీవికి మాత్రమే సాధ్యమైంది. సంక్రాంతి సీజన్‌ను బాస్ పక్కాగా వాడేశారు.రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా హవా కొనసాగుతోంది. కేవలం మాస్ మాత్రమే కాదు, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ వల్ల మహిళలు, పిల్లలు కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు.వరుస షూటింగ్‌లు, ప్రమోషన్లతో బిజీగా గడిపిన మెగా ఫ్యామిలీ, ఇప్పుడు ఈ అద్భుతమైన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమైంది. చిరంజీవి, సురేఖ గారితో పాటు సుస్మిత ఫ్యామిలీ, రామ్ చరణ్, ఉపాసనలు కూడా ఈ వెకేషన్‌లో భాగం కాబోతున్నట్లు సమాచారం. దాదాపు వారం రోజుల పాటు వీరు విదేశాల్లో సేదతీరనున్నారు.ఈ ట్రిప్ ముగించుకుని వచ్చిన తర్వాతే చిరంజీవి తన తదుపరి చిత్రం 'విశ్వంభర' పనుల్లో వేగం పెంచనున్నారు.
మార్చిలో రామ్ చరణ్ పుట్టినరోజు ఉండటంతో, అప్పటికల్లా చరణ్ తన 'పెద్ది' షూటింగ్ పనులు ముగించుకుని ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' అప్‌డేట్లు ఒకవైపు, నాన్న ₹300 కోట్ల హిట్ మరోవైపు ఉండటంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.మెగాస్టార్‌లోని పాత చిరంజీవిని (వింటేజ్ లుక్) మళ్ళీ బయటకు తీయడంలో అనిల్ సక్సెస్ అయ్యారు. సినిమాలో వెంకటేష్ చేసిన సందడి కూడా వసూళ్ల పెరుగుదలకు ఒక ప్రధాన కారణం.మొత్తానికి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో మెగా కాంపౌండ్ లో పండగ వాతావరణం నెలకొంది. సుస్మిత కొణిదెల సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా సెటిల్ అవ్వడం, చిరంజీవి బాక్సాఫీస్ బాద్‌షా అని నిరూపించుకోవడం మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా. వెకేషన్ ముగించుకుని వచ్చాక బాస్ మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయం!