బాలీవుడ్ లో అవమానం..రకుల్ ప్రీతిసింగ్ షాకింగ్ కామెంట్స్..!

Divya
టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడే పలు సినిమాలలో నటించడంతో తెలుగులో క్రేజ్ పడిపోయింది. కానీ బాలీవుడ్లో అవకాశాలు వస్తూ ఉన్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేదు. బాలీవుడ్ లో నిర్మాతగా పేరు సంపాదించిన జాకీ భగ్నాని ప్రేమించి వివాహం చేసుకుంది.



ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలలో నటించిన సక్సెస్ కాలేదు. ఇటువంటి తరుణంలోనే బాలీవుడ్లో తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. రకుల్ ప్రీతిసింగ్ మాట్లాడుతూ తాను తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించినప్పటికీ బాలీవుడ్ మేకర్స్ మాత్రం తనని ఒక కొత్త నటిగానే చూసేవారని, దీంతో మళ్లీ తాను బాలీవుడ్ లో జీరో నుంచి మొదలు పెట్టాల్సి వచ్చిందని తెలిపింది.. ముఖ్యంగా నెపోటిజం గురించి తాను ప్రస్తావిస్తూ.. మనం బయట వ్యక్తులం కాబట్టి ఇక్కడ ఎలాంటి సదుపాయాలు ఉండవు. కాస్టింగ్ డైరెక్టర్లకు ఫోన్ చేసిన కూడా కనీసం రెస్పాన్స్ అవ్వరు , ఒకవేళ ఎత్తిన చాలా నిర్లక్ష్యంగా సమాధానాన్ని చెబుతారంటు తెలిపింది.


అలా తన జీవితంలో ఒక అడిషన్ కోసం తాను గంటల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగానని, అలా తన మానసిక ధైర్యాన్ని కూడా పరీక్షించిందంటూ తెలిపింది. ఆ తర్వాత దే దే ప్యార్ దే, రన్ వే-34  వంటి చిత్రాలతో బాలీవుడ్లో తనకు పేరు వచ్చిందని, ఆ తర్వాత 2024లో జాకీ భగ్నానినీ పెళ్లి చేసుకోవడంతో కొంత సెక్యూరిటీ లభించిందని తెలిపింది. ప్రస్తుతం బాలీవుడ్లో రకుల్ ప్రీతిసింగ్ ప్రతిపత్ని ఔర్ వో సినిమాతో పాటు భారతీయుడు 3 సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో మాత్రం ఏ ఒక్క సినిమాలో కనిపించలేదు రకుల్ ప్రీతిసింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: