ఆ హీరోయిన్ అంటే ఇష్టం.. రెండో పెళ్లిపై హింట్ ఇచ్చిన డైరెక్టర్.!

Pandrala Sravanthi
చాలా రోజుల నుండి జరుగుతున్న ప్రచారానికి హీరోయిన్,డైరెక్టర్ కం హీరో ఇద్దరు క్లారిటీ ఇచ్చేశారు. మరి ఇంతకీ వాళ్ళు ఎవరయ్యా అంటే పెళ్లిచూపులు ఫేమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా. తరుణ్ భాస్కర్ హీరోగా.. ఈషా రెబ్బా హీరోయిన్ గా..ఓం శాంతి శాంతి శాంతిః అనే మూవీ తెరకెక్కింది. ఈ మూవీ జనవరి 30న మన ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. అయితే తాజాగా ఈ ప్రమోషన్స్ లో కొంతమంది మీడియా మిత్రులు మీ ఇద్దరి మధ్య నిజంగానే ప్రేమాయణం నడుస్తుందా అని డైరెక్టర్ కం హీరో అయినటువంటి తరుణ్ భాస్కర్ ని ప్రశ్నించగా.. నాకు హీరోయిన్ ఈషా అంటే చాలా ఇష్టం. ఆమె శాంతికి ప్రతిరూపం. 


ఈ సినిమాలో ఆమెనే హీరో.. అంటూ చెప్పుకోచ్చారు. అయితే పరోక్షంగా హీరోయిన్ ఈషా రెబ్బా మీద ఉన్న తన ఇష్టాన్ని తరుణ్ భాస్కర్ బయటపెట్టారని అర్థం చేసుకోవచ్చు. మరోపక్క హీరోయిన్ ఈషా రెబ్బా సైతం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. తరుణ్ భాస్కర్ తో ప్రేమ పెళ్లి అంటూ వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదు. ఈ వార్తలు ఇప్పటికే చాలాసార్లు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు చూసి మా నాన్న కూడా పెళ్లేప్పుడు అంటూ ఫన్నీగా ప్రశ్నిస్తున్నారు. కానీ అదంతా దుష్ప్రచారం మాత్రమే. ప్రస్తుతం నేను ఒకరితో డేటింగ్ లో ఉన్నాను.కానీ అది ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది అని తన భాషలో ఐ యాం సీయింగ్ సం వన్ అంటూ చెప్పుకొచ్చింది.


అలా ఈ ఇద్దరు తమ డేటింగ్ వార్తలపై పరోక్షంగా ఇద్దరి మధ్య ఏదో ఉంది అన్నట్లుగానే స్పందించారు.అయితే ఈషా రెబ్బా డేటింగ్ లో ఉన్నాను అని చెప్పింది కానీ ఆ డేటింగ్ లో ఉన్న వ్యక్తి తరుణ్ భాస్కరా కాదా అనే విషయాన్ని మాత్రం క్లారిటీగా చెప్పలేదు. ఇక వీరిద్దరి ప్రవర్తనను బట్టి చూసుకుంటే త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కిన ఆశ్చర్యపోనక్కర్లేదని అర్థం చేసుకోవచ్చు.అయితే ఈషా రెబ్బా కి పెళ్లి కాకపోయినప్పటికీ తరుణ్ భాస్కర్ కి మాత్రం ఇప్పటికే పెళ్లయింది. ఒకవేళ ఈషాని చేసుకుంటే మొదటి భర్యకు విడాకులు ఇవ్వాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: