మొత్తానికి వరుడు సినిమా ఫ్లాప్ పై..గుణశేఖర్ షాకింగ్ కామెంట్స్..?

Divya
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ దర్శకులలో ఎంతో మంది హీరోలకు సక్సెస్ అందించారు డైరెక్టర్ గుణశేఖర్. ముఖ్యంగా సినిమాలలో భారీ సెట్టింగ్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఒక్కడు, చూడాలని ఉంది సినిమాలతో మంచి విజయాలను అందుకున్న డైరెక్టర్ గుణశేఖర్ ఆ తర్వాత వరుసగా ప్లాపులను ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలోనే రుద్రమదేవి సినిమా తియ్యగా పరవాలేదు అనిపించుకుంది. కాని సమంతతో చేసిన శాకుంతలం సినిమా డిజాస్టర్ గా మిగిలింది. దీంతో కొన్నేళ్లు గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరొకసారి డైరెక్టర్ గా యుఫోరియా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.


భూమిక ప్రధాన పాత్రలో ,సారా అర్జున్ నటిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభించడంతో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ గుణశేఖర్ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ మీ కెరియర్ లో బాగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన చిత్రం ఏదైనా ఉందా అని ప్రశ్నించగా?.. అందుకు గుణశేఖర్ మాట్లాడుతూ తన కెరియర్లో బాగా డిసప్పాయింట్ చేసిన చిత్రం అల్లు అర్జున్ తో చేసిన వరుడు సినిమానే.


వరుడు చిత్రంలో ఐదు రోజుల పెళ్లి, పీటలపైనే అమ్మాయిని చూడడం అనే కాన్సెప్ట్ తో తీశాము. ఈ కథ మీద అల్లు అర్జున్ కు కూడా చాలా నమ్మకం ఉండేది, ఈ చిత్రంలో యాక్షన్ వద్దనుకున్నాము అందుకు బన్నీ కూడా ఒప్పుకున్నారు. కొంతమంది చెప్పిన మాటలు విని ఇందులో కొన్ని యాక్షన్ సీన్స్ యాడ్ చేయవలసి వచ్చింది.. ముఖ్యంగా ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం అందులో ఉన్న హీరోయిన్.. ఆమెను పెళ్లి పీటల మీద చూపించాలనే ఆలోచనతో ఆమె ఫోటో ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. దీంతో ప్రేక్షకులు అమ్మాయి చూశాక ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇది కూడా సినిమాకి చాలా ఎఫెక్ట్ పడింది. అంతేకాకుండా తాను కథ విషయంలో మరింత కేర్ తీసుకొని ఉంటే బాగుండేదేమో అంటూ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: