గ్లామర్ వెనుక గ్రౌండ్ రియాలిటీ.. తరుణ్ భాస్కర్ మాటలు వైరల్..!
తరుణ్ భాస్కర్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా 'పెళ్లి చూపులు'. ఆ సినిమా స్క్రిప్ట్ రాసేటప్పుడు ఆయన ఇంట్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి.తరుణ్ తండ్రి అనారోగ్యంతో చివరి రోజుల్లో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. రాత్రులు తన తండ్రి ఇంకా శ్వాస తీసుకుంటున్నారా లేదా అని చెక్ చేసుకుంటూ.. పక్కనే కూర్చుని 'పెళ్లి చూపులు' లాంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ స్క్రిప్ట్ రాశారట."నా జీవితంలో అది అతిపెద్ద ట్రాజెడీ. కానీ ఆ బాధ నుంచి తప్పించుకోవడానికే నేను కామెడీని ఆశ్రయించాను. చార్లీ చాప్లిన్ నుంచి బ్రహ్మానందం గారి వరకు అందరి వెనుక ఇలాంటి పెయిన్ ఉంది" అని ఆయన వివరించారు.
హీరోలు, కమెడియన్లు తెరపై నవ్వుతున్నారంటే లోపల ఏదో బాధ ఉంటుందని తరుణ్ అన్నారు. 'అహనా పెళ్లంట' సినిమాలో నటించడానికి ముందు బ్రహ్మీ గారు తన లెక్చరర్ ఉద్యోగం వదిలేసి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ ట్రాజిక్ సిట్యువేషనే ఆయన్ని గొప్ప నటుడ్ని చేసింది.ఇంట్లో అమ్మానాన్నలు గొడవ పడుతున్నా, స్కూల్‌లో ఫ్రెండ్స్ ముందు నవ్వుతూ మేనేజ్ చేయడమే ఒక ఆర్టిస్ట్‌కు ఉండే లక్షణం అని తరుణ్ భాస్కర్ విశ్లేషించారు.తమ సినిమాతో హీరో అయిన విజయ్ దేవరకొండ గురించి కూడా తరుణ్ ఆసక్తికరంగా మాట్లాడారు."విజయ్ ఒక ఐకానిక్ ఇమేజ్ (అర్జున్ రెడ్డి) సృష్టించుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న ఫ్లాపులు కేవలం ఒక ఫేజ్ మాత్రమే. ప్రతి హీరో కెరీర్ గ్రాఫ్ ఈసీజీ (ECG) లా ఉండాలి. అప్పుడే మనిషి బతికి ఉన్నట్టు లెక్క. విజయ్ మళ్ళీ స్ట్రాంగ్‌గా కమ్ బ్యాక్ ఇస్తాడు" అని ధీమా వ్యక్తం చేశారు.
సెలబ్రిటీలను సోషల్ మీడియాలో అసభ్యంగా తిట్టే వారికి తరుణ్ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు.లైట్ తీసుకోండి: "మమ్మల్ని మా అమ్మలే బూతులు తిడుతుంటారు, మీ తిట్లు మాకేం కొత్త కాదు" అని సరదాగా అంటూనే.. ఎదుటివారిని కించపరిచే వారిని దేవుడు క్షమించడని హెచ్చరించారు.ఫ్యాన్స్ అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న 'ఈ నగరానికి ఏమైంది 2' (ENA 2) అప్‌డేట్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నానని, త్వరలోనే గ్యాంగ్ అంతా కలిసి థియేటర్లలో రచ్చ చేయబోతున్నామని హింట్ ఇచ్చారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.మొత్తానికి తరుణ్ భాస్కర్ మాటలు వింటుంటే.. మనకు కనిపించే గ్లామర్ వెనుక ఎంతో కష్టం, కన్నీరు ఉంటాయని అర్థమవుతోంది. బాధను దిగమింగి లోకానికి నవ్వులు పంచే ఈ దర్శకుడికి సెల్యూట్ చేయాల్సిందే.