నాగ్ "బావ నచ్చాడు" మూవీకి మొదట అనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ కలిగిన స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జున గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగార్జున తన కెరియర్లో ఎన్నో సినిమాలలో హీరో గా నటించి ఎన్నో విజయాలను అందుకొని అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పటికి కూడా నాగార్జున అదిరిపోయే రేంజ్ లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. నాగార్జున చాలా సంవత్సరాల క్రితం బావ నచ్చాడు అనే సినిమాలో హీరో గా నటించాడు.


ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే మొదట ఈ సినిమాను నాగార్జున పై కాకుండా మరో స్టార్ హీరో పై రూపొందించాలి అని అనుకున్నారు. ఆల్మోస్ట్ అంతా సిద్ధం అయ్యి సినిమాను స్టార్ట్ చేద్దాం అనుకునే సమయంలో ఆ సినిమా క్యాన్సల్ అయింది. దానితో అదే కథ తో ఆ హీరోతో కాకుండా నాగార్జున తో ఆ సినిమాను రూపొందించాయన్నట్లు తెలుస్తోంది. ఇంతకు బావ నచ్చాడు సినిమాలో మొదటగా హీరోగా అనుకున్నది ఎవరినో తెలుసా ..? ఆయన మరెవరో కాదు ... సూపర్ స్టార్ మహేష్ బాబు.


అసలు విషయం లోకి వెళితే ... బావ నచ్చాడు మూవీ కి సంబంధించిన కథ మొత్తం పూర్తి అయిన తర్వాత ఆ సినిమాలో మహేష్ బాబు ని హీరో గా తీసుకోవాలి అనుకున్నారు. అందులో భాగంగా మహేష్ బాబు కు కథను వినిపించగా ఆయన కూడా దానికి ఓకే చెప్పాడు. కానీ అంతకు ముందే మహేష్ నటించిన యువరాజు సినిమా విడుదల అయ్యి ఫ్లాప్ కావడంతో కృష్ణ గారు ఈ సినిమాను పక్కన పెట్టే సారట. దానితో అదే కథను నాగార్జున హీరోగా రూపొందించినట్లు తెలుస్తుంది. ఇలా మహేష్ రిజెక్ట్ చేసిన మూవీ లో నాగార్జున హీరోగా నటించి అపజయాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: