అందుకే సౌత్ ఇండస్ట్రీలో ఇలియానాను బ్యాన్ చేశారా..?
అంతేకాకుండా ఇలియానా పై సౌత్ సినీ ఇండస్ట్రీ పదేళ్లపాటు నిషేధించినట్లు గతంలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చారు ప్రముఖ నిర్మాత కాట్రాగడ్డ ప్రసాద్. ఇలియానా విషయంపై మాట్లాడుతూ.. రవితేజ నటించిన దేవుడు చేసిన మనుషులు సినిమా సమయంలో ఒక తమిళ చిత్రానికి కమిట్ అయి రూ .40 లక్షల రూపాయల వరకు అడ్వాన్స్ తీసుకుందని,ఆ సినిమా మొదలు కాకపోవడంతో నిర్మాత తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇలియానాను కోరగా ఆమె నిరాకరించింది. దీంతో ఇలియానా తను డేట్స్ అడ్జస్ట్ చేసి ఇచ్చిన నిర్మాత వాడుకోలేదని వాదించింది.
ఈ విషయంపై కౌన్సిల్ లాగ్ సీట్లు తనిఖీలు చేయగా, ఆమె ఇచ్చినవన్నీ కూడా ఫేక్ డేట్లు అని తేలింది. ఆమె ఇచ్చిన డేట్లలోఇతర సినిమాలలో ఇలియానా నటించినట్లుగా తేలింది. దీంతో ఛాంబర్ సైతం ఇలియానా ను డబ్బులు కడతారా? లేకపోతే బ్యాన్ ఎదుర్కొంటారా ? హెచ్చరించింది. అయినప్పటికీ కూడా ఇలియానా డబ్బులు చెల్లించకపోవడంతో ఆమె పైన సౌత్ ఇండస్ట్రీ లో నిషేధం అమలులోకి వచ్చిందని తెలిపారు. దీంతో ఆమెతో సినిమాలు చేయాలనుకున్న నిర్మాతలకు కూడా ఇలియానా తీసుకున్న రూ .40 లక్షల రూపాయలు కడితే షూటింగ్ కు అనుమతి ఇస్తామంటు ఛాంబర్ కూడా నిర్మాతలను హెచ్చరించింది. దీంతో ఇలియానాని తమ సినిమాలలో తీసుకోవడానికి నిర్మాతలు ముందుకు రాలేదు. ప్రస్తుతం ఇలియానా పైన నిర్మాత చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి