లోకేష్ కనగరాజ్ ఈమధ్యనే కూలీ మూవీతో వచ్చి అభిమానుల అంచనాలను తలకిందులు చేశారు. రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ ల కాంబోపై అభిమానులు మొదటి నుండి ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ వంటి ఎంతోమంది తారలు నటించడంతో సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.కానీ చివరికి సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్ గా నిలిచింది. లోకేష్ కనగరాజ్ మార్క్ డైరెక్షన్ ఆ సినిమాలో కనిపించలేదు.. దాంతో సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అనిపించుకుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ తన నెక్స్ట్ ఫిల్మ్ అల్లు అర్జున్ తో చేస్తున్నట్టు ప్రకటించేశారు. గత రెండు వారాల క్రితమే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.
అయితే ఇదిలా ఉంటే తాజాగా లోకేష్ కనగరాజ్ తాను హీరోగా చేయబోయే సినిమాతో పాటు అల్లు అర్జున్ మూవీ, ఖైదీ-2 వీటన్నింటిపై క్లారిటీ ఇవ్వడం కోసం ఓ ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు.
ఈ ప్రెస్ మీట్ లో భాగంగా ఆయన ఎన్నో విషయాలు పంచుకున్నారు. అయితే ఇందులో ఓ రిపోర్టర్ లోకేష్ కనగరాజ్ ని ఇరుకున పెట్టే ప్రశ్న అడిగారు. అదేంటంటే..గత కొద్ది రోజులుగా ఓ హీరోయిన్ తో మీకు ఎఫైర్ ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే మీరు ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నారా.. అంటూ ప్రశ్నించగా..లోకేష్ కనగరాజ్ అలాంటిదేమీ లేదండి.. నాకు ఫ్యామిలీ ఉంది అని సర్ది చెప్పారు.కానీ ఆ రిపోర్టర్ మాత్రం లోకేష్ కనగరాజ్ మాటల్ని పట్టించుకోకుండా మళ్ళీ అదే ప్రశ్నపై సెకండ్ ఫ్యామిలీ పెట్టే ఉద్దేశం ఏమైనా ఉందా అన్నట్లుగా ప్రశ్నించడంతో.. వెంటనే లోకేష్ కనగరాజ్ తన ప్రెస్ మీట్ ముగించేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ అసలు ఆ రిపోర్టర్ కి కాస్తయినా ఇంగీత జ్ఞానం ఉందా..
ఇలాంటి చీప్ బిహేవియర్ ఉన్నవారు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయారు అంటూ మండిపడుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా కొత్త సినిమాలు విడుదలయితే చాలు ఆ సినిమాలకు సంబంధించిన చిత్ర యూనిట్ ప్రెస్ మీట్లలో పాల్గొనాలి అంటేనే వణికిపోతున్నారు.ఏ రిపోర్టర్ నోటి నుండి ఎలాంటి ప్రశ్న ఎదురవుతుందా.. ఆ ప్రశ్నకు ఇలాంటి సమాధానం చెప్పాలా అని సతమతపడుతున్నారు. ఇప్పటికే తెలుగులో ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎన్నో చూసాం.అలా తాజాగా లోకేష్ కనగరాజ్ కి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో లోకేష్ కనగరాజ్ కి ఓ హీరోయిన్ తో ఎఫైర్ ఉన్నట్టు రూమర్స్ వినిపించడంతో ఆ రిపోర్టర్ ఈ ప్రశ్న అడిగినట్టు తెలుస్తుంది.