టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి తాజాగా మన శంకర వర ప్రసాద్ గారు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించగా ... ఆయిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరిలీయో సంగీతం అందించగా ... షైన్ స్క్రీన్ , గోల్డ్ బాక్స్ బ్యానర్ల పై సాహు గారపాటి , సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ని జనవరి 12 వ తేదీన విడుదల చేశారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 15 రోజుల బా క్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 15 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లను వసూలు చేయడం మాత్రమే కాకుండా భారీ లాభాలను కూడా అందుకుంది. ఈ సినిమా లాభాల్లో సరికొత్త రికార్డును సృష్టించే దిశగా ముందుకు సాగుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ మరియు లాభాల వివరాలను క్లియర్గా తెలుసుకుందాం.
15 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 43.09 కోట్ల కలెక్షన్లు దక్కగా , సిడెడ్ లో 21.73 కోట్లు , ఉత్తరాంధ్ర లో 21.25 కోట్లు , ఈస్ట్ లో 15.02 కోట్లు , వెస్ట్ లో 9.47 కోట్లు , గుంటూరు లో 10.85 కోట్లు , కృష్ణ లో 10.59 కోట్లు , నెల్లూరులో 6.42 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా 15 తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండు రోజుల్లో ఈ మూవీ కి 139.42 కోట్ల షేర్ ... 212.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక 15 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 12.95 కోట్లు , ఓవర్సీస్ లో 19.02 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 15 రోజుల్లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 171.39 కోట్ల షేర్ ... 280.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా 120.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... 122 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బరి లోకి దిగింది. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని 49.39 కోట్ల లాభాలను అందుకుంది. ఈ సినిమా 50 కోట్ల లాభాలను అందుకోవడానికి అత్యంత చేరువగా వచ్చేసింది.