మెగాస్టార్ చిరంజీవి తాజాగా మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను జనవరి 11 వ తేదీన రాత్రి నుండే ప్రదర్శించారు. ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారానే మంచి టాక్ రావడంతో ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు నుండి అద్భుతమైన కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకు విడుదల అయిన 15 వ రోజు కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కాయి. కానీ విడుదల అయిన 15 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మాత్రం ఈ సినిమా మూడవ స్థానంలో నిలిచింది.
ఈ మూవీ కంటే ముందు లిస్ట్ లో రెండు సినిమాలు ఉన్నాయి. విడుదల అయిన 15 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలలో మొదటి స్థానంలో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా 5.33 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అలా వైకుంఠపురంలో సినిమా 3.73 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇకపోతే చిరంజీవి హీరోగా రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ విడుదల అయిన 15వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.14 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మూడవ స్థానంలో కొనసాగుతోంది. ఇకపోతే మన మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ఇప్పటికే అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి సూపర్ సాలిడ్ లాభాలను అందుకొని బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.