తన ప్రియమైన రెండో భర్త రాజ్ సంతోషం కోసం సమంత అలాంటి పని చేయబోతుందా..? గ్రేట్ వైఫ్..!
ఇప్పుడు తాజాగా సమంత రెండో వివాహం చేసుకుంది. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడుమోరును వివాహం చేసుకున్న అనంతరం, ఆమె తన పేరును ‘సమంత నిడుమోరు’గా మార్చుకోనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది అధికారికంగా ప్రకటించకపోయినా, ఈ వార్త సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.ముఖ్యంగా నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విషయంలో ఈ పేరు మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సినిమా టైటిల్ కార్డ్స్‌లో ‘సమంత నిడమోరు’ అనే పేరుతోనే ఆమె పేరు దర్శనమివ్వబోతున్నట్లు సమాచారం. దీంతో ఇది ఆమె వివాహం తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రం కావడం వల్లే కాకుండా, కొత్త పేరుతో ప్రారంభమవుతున్న రెండో ఇన్నింగ్స్‌గా కూడా అభిమానులు భావిస్తున్నారు.
టాలీవుడ్‌లో ఇది కొత్త విషయం కాదు. ఇప్పటికే పలువురు ప్రముఖ నటీమణులు వివాహం అనంతరం తమ భర్తల ఇంటిపేరును తమ పేరుతో జతచేసుకున్నారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత ఘట్టమనేని, మెగా కుటుంబానికి కోడలిగా మారిన లావణ్య త్రిపాఠి కొణిదెల వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. వీరి నిర్ణయాలు వారి వ్యక్తిగత అభిరుచులను ప్రతిబింబిస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.అయితే అందరూ ఇదే మార్గాన్ని ఎంచుకుంటున్నారు అనుకోవడం సరైంది కాదు. ఇటీవల నాగచైతన్యను వివాహం చేసుకున్న శోభిత ధూళిపాళ మాత్రం ఇప్పటికీ తన పాత పేరునే కొనసాగిస్తున్నారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘చీకటిలో’ టైటిల్ కార్డ్స్‌లో కూడా ‘శోభిత ధూళిపాళ’ అనే పేరే కనిపించింది. దీంతో పేరు మార్పు పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమేనని మరోసారి స్పష్టమవుతోంది.
ఇక సమంత విషయానికి వస్తే, ఆమె రెండో ఇన్నింగ్స్‌లో ‘నిడుమోరు’ అనే ఇంటిపేరుతో ఎంతటి విజయాలను అందుకుంటుందోనన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే నటిగా తన ప్రతిభను ఎన్నోసార్లు నిరూపించిన సమంత, ఈ కొత్త దశలో కూడా అదే స్థాయిలో విజయాలను కొనసాగిస్తుందన్న నమ్మకం చాలామందిలో ఉంది. ముఖ్యంగా ‘మా ఇంటి బంగారం’ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో, ఈ చిత్రం ఆమె కెరీర్‌లో ఒక కీలక మలుపుగా మారుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.మొత్తానికి, పేరు మార్పు ఒక వ్యక్తిగత నిర్ణయం అయినప్పటికీ, స్టార్ నటీమణుల విషయంలో అది ప్రేక్షకుల దృష్టిని తప్పక ఆకర్షిస్తోంది. సమంత తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ఆమె జీవితంలో, కెరీర్‌లో ఏ మేరకు కొత్త అధ్యాయాన్ని తెరలేపుతుందో చూడాలి.