అప్పుడు సమంత..ఇప్పుడు రష్మిక..పెళ్లికి ముందే టార్చర్ స్టార్ట్ చేసేశారా..?
ఇదిలా ఉండగా, తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. విజయ్ దేవరకొండతో పెళ్లి కారణంగానే రష్మిక మందన ఒక బంపర్ ఆఫర్‌ను మిస్ చేసుకుందంటూ సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఆ ఆఫర్ ఏంటంటే… గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఓ పాన్ ఇండియా సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశం రష్మికకు వచ్చిందట. సాధారణంగా రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా మిస్ చేసుకోదనే చెప్పాలి. పైగా పాన్ ఇండియా సినిమాలో ఐటెం సాంగ్ అంటే కెరీర్‌కు భారీ బూస్ట్ ఇచ్చే ఛాన్స్‌గా భావిస్తారు.
అయితే వైరల్ అవుతున్న కథనాల ప్రకారం, విజయ్ దేవరకొండతో పెళ్లి వార్తల నేపథ్యంలో అలాంటి పాట చేస్తే భవిష్యత్తులో ఎలాంటి అడ్డంకులు వస్తాయో అన్న ఆలోచనతో రష్మిక ఆ ఆఫర్‌ను తిరస్కరించిందట. నిజంగా ఆమె ఆ సాంగ్ చేసుంటే ఆమె క్రేజ్ మరింత పెరిగేది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో మాత్రం ఎవరికీ స్పష్టత లేదు.ఈ రూమర్స్ ఆధారంగా కొందరు నెటిజన్లు రష్మికను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. “ఇప్పుడే విజయ్ దేవరకొండ చెప్పుచేతల్లోకి వెళ్లిపోయావా?” అంటూ కొందరు ఆకతాయిలు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు మరికొందరు మాత్రం రష్మిక తీసుకున్న నిర్ణయం సరైనదే అంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
నిజానిజాలు తెలియకుండానే, ఒకప్పుడు సమంత విషయంలో జరిగినట్లే ఇప్పుడు రష్మికను కూడా టార్గెట్ చేసి ట్రోల్ చేయడం సరికాదని ఆమె అభిమానులు మండిపడుతున్నారు. వ్యక్తిగత జీవితానికి, కెరీర్ నిర్ణయాలకు సంబంధించి అసత్య వార్తలు ప్రచారం చేసి హీరోయిన్లను మానసికంగా వేధించడం తప్పు అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గట్టిగా స్పందిస్తున్నారు.మొత్తానికి, అధికారిక ప్రకటనలు లేకుండా వస్తున్న ఈ రూమర్స్, ట్రోల్స్ రష్మిక మందన్నాకు అనవసరమైన ఒత్తిడిని తీసుకొస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.