షాక్: బ్రేకప్ ప్రకటించిన బిగ్ బాస్ బ్యూటీ..?
అలా ఎవరు లేకుండా ఒంటరి జీవితాన్ని మొదలుపెట్టిన కీర్తి భట్ ఒక అనాధ అమ్మాయిని దత్తకు తీసుకొని మరి పెంచుతున్న సమయంలోనే ఆ పాప చనిపోయింది. ఆ తర్వాత హీరో విజయ్ కార్తీక్ తో ప్రేమలో ఉన్నానని పరిచయం చేసిన కీర్తి తాజాగా బ్రేకప్ జరిగిందనే విషయాన్ని బయట పెట్టింది. గడిచిన రెండు సంవత్సరాల క్రితం హీరో విజయ్ కార్తీక్ తో కీర్తి భట్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత చాలా రోజులు ఇద్దరు కూడా లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. వీరిద్దరూ పలు రకాల టీవీ షోలలో కనిపిస్తూ ఉన్న ఈ జంట ఇప్పుడు తాజాగా తమ బంధానికి ఎండ్ కార్డు వేసింది కీర్తి భట్.
ఈ బంధం చాలా రోజులపాటు కొనసాగింది అది నిజమైనది కూడా కానీ ఈ బంధం ఎప్పుడు జీవితం భాగస్వామి లేదా భర్తగా మారినట్టు కనిపించలేదు. అందుకే ఇద్దరూ స్నేహితులుగా ఉండాలనుకున్నామంటు కీర్తి భట్ తన సోషల్ మీడియా వేదికగా తమ బ్రేకప్ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల ఎవరైనా బాధపడి ఉంటే నేను హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను, వీటి పైన కూడా రూమర్స్ క్రియేట్ చేసి నన్ను బాధ పెడుతున్నారు. ఇక నాకు జీవితం అంటే యుద్ధం సమయం లాంటిది అంటూ రాసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి పోస్టు వైరల్ గా మారింది.