అక్కడ తెలుగు సినిమాల పరిస్థితి అది.. లిస్టులో ఒకే ఒక్క టాలీవుడ్ మూవీ..?

Pulgam Srinivas
తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన చాలా క్రేజీ సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యాయి. ఇక సంక్రాంతి పండుగకు భారీ సినిమాలు విడుదల అయ్యాక ఆ తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి విడుదల కాలేదు. ఇప్పటికే సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల అయిన సినిమాలు రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది. దానితో చాలా వరకు సంక్రాంతి కి విడుదల అయిన సినిమాలకు బాక్సా ఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు దక్కడం లేదు. బుక్ మై షో ఆప్ లో కూడా సంక్రాంతి కి విడుదల అయిన తెలుగు సినిమాలలో మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ని మినహాయిస్తే వేరే సినిమాలకు భారీ స్థాయిలో టికెట్స్ బుక్ కావడం లేదు. దానితో ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో ఆప్ లో అత్యధిక టికెట్స్ సేల్ అయిన టాప్ 4 మూవీలలో మూడు సినిమాలు హిందీవే నిలిస్తే కేవలం ఒకే ఒక్క సినిమా తెలుగుది ఉండడం విశేషం. మరి ఆ నాలుగు సినిమాలు ఏవి అనేది క్లియర్ గా తెలుసుకుందాం.

తాజాగా హిందీ సినిమా పరిశ్రమ నుండి బర్డర్ 2 అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి మంచి టాక్ వచ్చింది. దానితో ప్రస్తుతం ఈ సినిమాకి సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కుతున్నాయి. బుక్ మై షో ఆప్ లో ఆఖరి 24 గంటల్లో ఈ సినిమాకు సంబంధించిన 171.28 కే టికెట్లు సేల్ అయ్యాయి. ఇక ఆ తర్వాత స్థానంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ నిలిచింది. బుక్ మై షో ఆప్ లో ఆఖరి 24 గంటల్లో మన శంకర వర ప్రసాద్ గారు మూవీ కి సంబంధించిన 15.77 కే టికెట్లు సేల్ అయ్యాయి. ఆ తర్వాత ప్లేస్ లో చేత పచ్చ మూవీ 11.50 కే టికెట్స్ సేల్ కావడంతో మూడవ స్థానంలో నిలిచింది. ఇక దురందర్ మూవీ కి సంబంధించిన 7.05 కే టికెట్లు సేల్ అయ్యాయి. ఇలా బుక్ మై షో లో ఆఖరి 24 గంటల్లో అత్యధిక టికెట్స్ సేల్ అయిన టాప్ 4 లిస్టులో ఈ నాలుగు సినిమాలు నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: