చిరంజీవికి కౌంటర్ ఇచ్చిన యాంకర్.. ఎంతోమందిని వేధించిన వ్యక్తికి వెనక నుండి ఆఫర్స్ ఇస్తారంటూ పోస్ట్..!

Pandrala Sravanthi
రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ మీట్ లో చిరంజీవి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదు అని అన్న వ్యాఖ్యలపై చాలామంది మండిపడ్డారు. ఆయన చేసిన కామెంట్స్ ని కొంతమంది తప్పు పట్టడంతో చిరంజీవి వివాదంలో ఇరుక్కున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. క్యాస్టింగ్ కౌచ్ లేదు.వాళ్ళందరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీ లోకి రండి అని చిరంజీవి మాట్లాడిన మాటలకి కొంతమంది కౌంటర్ ఇచ్చారు.వారిలో తాజాగా యాంకర్ కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినటువంటి ఝాన్సీ కూడా కౌంటర్ ఇచ్చినట్టు ఆమె చేసిన తాజా పోస్ట్ లు చూస్తే అర్థం చేసుకోవచ్చు. తాజాగా యాంకర్ ఝాన్సీ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఈ విధంగా పోస్టులు పెట్టింది.. కమిట్మెంట్/ క్యాస్టింగ్ కౌచ్= పనిచేసే ప్రదేశాలలో లైంగిక వేధింపులు.. నిమ్మకు నీరెత్తినట్టు ఉండే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ  2018లో ఒక్కసారిగా తమ మీద పడ్డ చెత్తని ఊడ్చేసి చాప కింద పెట్టేసింది. 


కానీ కొంతమంది ప్రొడ్యూసర్లు దీన్ని పట్టించుకోరు.ఈ విషయాన్ని వదిలేయడం పరిష్కారం కాదు.కొన్ని కొన్ని గొంతులు కలిసి అరిస్తే ఒక ప్యానెల్ ని చేయగలము. కానీ సమస్యల్ని గుర్తించాలంటే కచ్చితంగా కంప్లైంట్ చేయడమే మొదటి అడుగు.. ఎంతోమందిని వేధించిన వ్యక్తి పేరు బయట పడ్డప్పుడు ఆ వ్యక్తిని వెనక నుంచి పని చేసుకోమని ఎంతో గౌరవం ఇచ్చిన సినిమాలోని లీడ్ స్టార్ కి తమ ముక్కుల కింద ఉండే నేరస్తులు అస్సలు కనిపించరు. వారి కళ్ళ ఎదుట అన్యాయాన్ని ప్రశ్నించే అమ్మాయిలే కనిపిస్తారు. తప్పంతా వాళ్లదే అని వాళ్ళ మీద నెట్టేయడం చాలా ఈజీ.. సామాన్య పిల్లల కష్టాలు, పెద్దింటి పిల్లల అనుభవాలు రెండు ఒకటే తరాజులో కొలవకండి మారాజా అంటూ పోస్టు పెట్టడంతో పాటు అవగాహన లేకపోతే, సందర్భం కాకపోతే, పూర్తి చర్చ జరగని సమయంలో సినిమా స్టేజీలపై ఇలాంటి సైద్దాంతిక ప్రకటనలు చేయడం ఎందుకు.. ప్లీజ్ సంయమనం.. మీరు అర్థం చేసుకోలేనంత డ్యామేజ్ ఇక్కడ జరుగుతుంది అంటూ తన పోస్టులో రాసుకువచ్చింది.

అంతేకాకుండా చిరంజీవి స్టేజ్ పై అమ్మాయిలు ధైర్యంగా ఉండండి అని మాట్లాడిన విషయాన్ని మరోసారి ఝాన్సీ తన పోస్టులో షేర్ చేస్తూ..అమ్మాయిలు ధైర్యంగా ఉండి వేధింపులకు, దుర్భలత్వంకి తలవంచకండి.. స్ట్రాంగ్ గా నిలబడండి. మీ హార్డ్ వర్క్ ని, స్కిల్ ని గుర్తించడానికి ఎవరు కూడా మిమ్మల్ని సెక్సువల్ ఫేవర్స్ అడక్కూడదు. ఒకవేళ అడిగినా మీరు ఇవ్వకండి.. అవసరమైతే ఇక్కడ కంప్లైంట్ చేయండి.ఈ ఇండస్ట్రీలో మహారాణిలా రాణించండి. వారు చెప్పాలనుకున్న అసలు అర్థం ఇదే.. కానీ వాళ్లు చెప్పిన పదాలను మీరు అపార్థం చేసుకున్నారేమో అంటూ యాంకర్ ఝాన్సీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వ్యంగ్యంగా వరుస పోస్టులు పెట్టింది. దీంతో యాంకర్ ఝాన్సీ పెట్టిన పోస్టులు తాజాగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. కొంతమంది ఝాన్సీ పోస్టులను చూసి చిరంజీవికి కౌంటర్ ఇచ్చింది అని కామెంట్లు పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: