ప్రభాస్ ఫ్యాన్స్ కి నిద్రపట్టనీకుండా చేస్తున్న వార్త..నిజమైతే హార్ట్ అటాక్ కన్ఫామ్..!

Thota Jaya Madhuri
ప్రభాస్ అభిమానులకు నిద్రలేని రాత్రులు ఇస్తున్న  ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజమైతే ఫ్యాన్స్‌కు టెన్షన్ తప్పదనే చెప్పాలి. టాలీవుడ్‌లో అగ్ర హీరోగా తనదైన మార్క్ కొనసాగిస్తున్న ప్రభాస్, వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన “ది రాజా సాబ్” సినిమాతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాతలకు నష్టాలు మిగిలాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభాస్ తన రాబోయే ప్రాజెక్టులపై మరింత ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న “స్పిరిట్” సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.అయితే ఇప్పుడు ప్రభాస్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. “స్పిరిట్” కంటే ముందుగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఫౌజీ” సినిమాను పూర్తిచేయాలని ప్రభాస్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని 2026 దసరా సందర్భంగా విడుదల చేయాలనే లక్ష్యంతో ప్లానింగ్ జరుగుతోందట.

అందుకే ప్రస్తుతం “స్పిరిట్” షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసి, ముందుగా “ఫౌజీ” సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే దిశగా ప్రభాస్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఫౌజీ పూర్తి చేసిన తరువాత మళ్లీ “స్పిరిట్” మిగతా భాగాల షూటింగ్‌ను కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారని టాక్. ఇప్పటికే “స్పిరిట్” సినిమాకు విడుదల తేదీ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ సినిమాను 2027 మార్చి 5వ తేదీన విడుదల చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ గ్యాప్ కారణంగానే ప్రభాస్ ముందుగా ఫౌజీని పూర్తి చేసి, ఆ తర్వాత స్పిరిట్‌పై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఈ మార్పులు నిజమైతే ప్రభాస్ లైనప్‌లో భారీ షిఫ్ట్ వచ్చినట్టే. అభిమానులు మాత్రం అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన కెరీర్‌కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: