ఇండియా నుంచి వరల్డ్‌కు వారణాసి దెబ్బ.. రాజమౌళి షో స్టార్ట్!
మహేష్ బాబును ఈ సినిమాలో రాజమౌళి ఎలా చూపించబోతున్నారో అన్నది ఇప్పుడు బిగ్గెస్ట్ సెన్సేషన్.జక్కన్న ప్లాన్ ప్రకారం మహేష్ బాబు మునుపెన్నడూ లేని విధంగా లాంగ్ హెయిర్, గడ్డంతో పక్కా అడ్వెంచరర్ లుక్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు విదేశాల్లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటున్నారు. జంగిల్ అడ్వెంచర్ కాబట్టి శారీరక దారుఢ్యం కోసం మహేష్ పడుతున్న శ్రమ చూస్తుంటే, బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం గ్యారెంటీ అనిపిస్తోంది.ఈ సినిమా బడ్జెట్ గురించి వింటేనే దిమ్మ తిరిగిపోతుంది. దాదాపు ₹800 నుంచి ₹1000 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట."ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో వచ్చే విజువల్ ఎఫెక్ట్స్ (VFX) హాలీవుడ్ చిత్రాలకు దీటుగా ఉంటాయట. రాజమౌళి వేసిన ఈ మాస్టర్ ప్లాన్ చూసి హాలీవుడ్ దర్శకులు సైతం ఆశ్చర్యపోతున్నారు."
కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా, నార్త్ ఇండియా మరియు విదేశీ సినీ ప్రేమికులు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి మార్క్ ఎమోషన్స్ కు మహేష్ బాబు స్టార్ డమ్ తోడైతే రికార్డుల ఊచకోత ఖాయం.రాజమౌళి ఈ సినిమాను ఒకేసారి 30కి పైగా భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. చైనా, జపాన్ మార్కెట్లను కూడా ఈసారి వదలకూడదని జక్కన్న గట్టిగా ఫిక్స్ అయ్యారు.మొత్తానికి ఎస్.ఎస్. రాజమౌళి వేసిన ఈ మాస్టర్ ప్లాన్ భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టబోతోంది. జక్కన్న చెక్కిన ఈ 'మహేష్' శిల్పం బాక్సాఫీస్ దగ్గర ఎన్ని వేల కోట్లు కొల్లగొడుతుందో చూడాలి. ఒక యోధుడిలా మహేష్ బాబు, ఒక మాంత్రికుడిలా రాజమౌళి కలిసి సృష్టించబోయే ఈ విజువల్ జాతర కోసం కౌంట్ డౌన్ మొదలైంది!