"చెత్త వెధవ వాడు".ఆ స్టార్ డైరెక్టర్ బండారం బయట పెట్టిన ఐశ్వర్య రాజేష్..!
ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్, హీరో తిరువీర్ సరసన నటిస్తున్న చిత్రం ‘ఓ సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్. నిర్మాత మహేశ్వర రెడ్డి మాలి ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.ఇదిలా ఉండగా, ఐశ్వర్య రాజేష్ ఇటీవల వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని సంచలన విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైంది.
ఆమె మాట్లాడుతూ…“నా కెరీర్ ప్రారంభంలో ఒక సినిమా ఆడిషన్స్‌కు వెళ్లాను. ఆ సమయంలో అక్కడున్న ఓ దర్శకుడు నన్ను సెక్సీ బట్టలు, నైట్ డ్రెస్ వేసుకుని రావాలని అడిగాడు. ఎందుకంటే అతనికి నా బాడీ చూడాలనిపించిందట. ఆ మాటలు విన్న వెంటనే నాకు చాలా కోపం వచ్చింది. ‘ఇలా ఎంతమందిని అడిగి ఉంటాడు?’ అని అప్పుడే అనిపించింది. ఆ ఘటన తర్వాత చాలా బాధపడ్డాను. అది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆ దర్శకుడి పేరును మాత్రం ఆమె బయటపెట్టలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ "చెత్త వెధవ వాడు" అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు ఎలా స్పందించాలి అన్న అంశంపై కూడా ఐశ్వర్య రాజేష్ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.“ఈ డ్రెస్ వేసుకోకు అని ఎవరైనా చెబితే నువ్వు ఏం చేస్తావు?” అనే యాంకర్ ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చింది.“నాకు అలా చెప్పినప్పుడు నిజానికి వాళ్లు చెప్పిన దుస్తులే వేసుకునేలా నేను మారిపోతాను. కానీ దుస్తులు అనేవి సందర్భాన్ని బట్టి ఉండాలి. ఇతరులు ఏం వేసుకుంటున్నారు అన్న విషయాన్ని నేను పట్టించుకోను. వాళ్లకు కంఫర్ట్‌గా ఉన్న దుస్తులే వేసుకుంటారని నేను భావిస్తాను” అని చెప్పింది.అలాగే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరో బాధాకరమైన విషయం గురించి కూడా ఐశ్వర్య రాజేష్ మాట్లాడింది. చిన్న వయసులోనే తన తండ్రి మరణించారని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ బాధ తన జీవితమంతా వెంటాడుతోందని, అయినా అదే తనను మరింత బలంగా నిలబెట్టిందని చెప్పింది.
ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఐశ్వర్య రాజేష్ నిజాయితీగా, ధైర్యంగా తన అనుభవాలను పంచుకున్న తీరుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొనే సమస్యలపై ఆమె మాట్లాడిన విధానం చాలామందికి ఆలోచన కలిగిస్తోందని కామెంట్లు చేస్తున్నారు.నటనతో పాటు వ్యక్తిత్వంతో కూడా ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్న ఐశ్వర్య రాజేష్, భవిష్యత్తులో మరిన్ని బలమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.