రూ. 80 లక్షల బడ్జెట్..కోట్లు లాభం తెచ్చిన అల్లరి నరేష్..!
కానీ సినిమా బడ్జెట్ విషయంలో చాలా భయాలు ఉన్నాయని నరేష్ తెలియజేశారు. మొదట ఈ సినిమా కోసం రూ .3 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకున్నప్పటికీ, అయితే ఇందులో లావుగా ఉన్న హీరోయిన్ ని పెడితే సినిమా ఆడుతుందా? ఎవరు కొంటారనే విషయం పై చాలా ప్రశ్నలు తలెత్తడంతో ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ. 80 నుంచి రూ .90 లక్షలకు తగ్గించేసామని, అంతేకాకుండా షూటింగ్ విషయాలలో కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే చేసే వాళ్ళమని. శని ఆదివారాలు నో షూటింగ్.సినిమా షూటింగ్లో విషయంలో తన తండ్రి చేసే పద్ధతి అది కాదు అని తెలిపారు.
కానీ అంత తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి రూ .8 కోట్ల రూపాయల కలెక్షన్ తో రాబట్టడం అంటే అది పెద్ద విజయం అంటూ తెలిపారు. కితకితలు సినిమా గీతా సింగ్ కెరియర్ కి ప్లస్ అయిందని తెలిపారు. ఇప్పటికీ కూడా కితకితలు సినిమాతోనే ఆమెను గుర్తుపడతారని ఈ సినిమా కోసం డబ్బింగ్ చెప్పి చాలా కష్టపడిందంటూ తెలిపారు. సినిమా విడుదలైన తర్వాత ఒక మహిళ మీ సినిమా చూసినప్పుడల్లా మా ఆయన నన్ను కితకితలు హీరోయిన్ లా ఉన్నావ్ అంటున్నాడని ఆ మహిళ నాతో చెబుతుంటే అప్పుడే సినిమాల ప్రభావం ప్రజలపై చాలానే ఉందని అర్థమయ్యిందని తెలిపారు.