విజయ్ దేవరకొండ సినిమాలో మరో స్టార్ హీరోయిన్..?

Divya
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రవి కిరణ్ కోలా కాంబినేషన్లో వస్తున్న చిత్రం రౌడీ జనార్ధన. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో విడుదల చేయగా అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఉండడమే కాకుండా నటీనటుల ఎంపిక విషయంలో చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.


ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ శోభన కూడా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హీరోకి తల్లిగా ఈమె పాత్ర సినిమాకి చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. దాదాపుగా దశాబ్దం తర్వాత శోభన ప్రభాస్ నటించిన కల్కి చిత్రంతో వెండితెరపైకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన శోభన ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాలో కూడా నటించబోతోందని తెలిసి అభిమానులు ఆనంద పడుతున్నారు.


అలాగే ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. గతంలో నటించిన చిత్రాల కంటే ఈసారి భిన్నంగా రాజశేఖర్ ని చూపించబోతున్నట్లు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ కు జోడిగా కీర్తి సురేష్ ని ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈసారి ఎలాగైనా ఈ సినిమాతో భారీ సక్సెస్ కొట్టేలా ప్లాన్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ. రణబలి అని మరో చిత్రంలో కూడా నటిస్తున్నారు. గత ఏడాది కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. మరి ఏడాది ఈ రెండు చిత్రాలతో ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: