క్లింకార ఫేస్ రివీల్.. రామ్ చరణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

Pandrala Sravanthi
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా తండ్రైన సంగతి మనకు తెలిసిందే.జనవరి 31న మెగా కోడలు ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చింది. 2023లో రామ్ చరణ్, ఉపాసనలకు క్లింకార జన్మించగా.. మళ్లీ 2026లో ఉపాసన ఒక పాప, ఒక బాబుకి జన్మనిచ్చింది. అలా ఉపాసనకి కవల పిల్లలు పుట్టడంతో వారిని చూడడం కోసం రాంచరణ్ తన కూతురు క్లింకారని తీసుకొని అపోలో హాస్పిటల్ కి వచ్చారు. అయితే అలా హాస్పిటల్ కి రామ్ చరణ్ వస్తాడని ముందే తెలుసుకున్న మెగా అభిమానులు అందరూ అపోలో హాస్పిటల్ ని చుట్టుముట్టారు.హాస్పిటల్ దగ్గర రాంచరణ్ తన కారు నుండి బయటకు దిగగానే ఆయన్ని చుట్టుముట్టి కనీసం లోపలికి పోవడానికి కూడా వీలు లేకుండా చేశారు. కానీ రామ్ చరణ్ తన బాడీగార్డ్ల సహాయంతో ఎలాగో అలా వారి నుండి తప్పించుకొని హాస్పిటల్ లోపలికి చేరుకున్నారు.


 అయితే అలా వెళ్లే సమయంలో రాంచరణ్ చేతిలో తన కూతురు క్లింకార ఉంది. అయితే క్లింకార ఫేస్ కనిపించకుండా కవర్ అయ్యేలా ఒక క్లాత్ ఆమె మీద కప్పుకొని తీసుకువచ్చినప్పటికీ అభిమానుల ఈలలు,గోలలు చూసి క్లింకార సడన్గా తన ఫేస్ ని బయటపెట్టింది. ఇక ఆ సమయంలో చాలామంది క్లింకార ఫేస్ ని చూసి వీడియోలు, ఫోటోలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇన్ని రోజులుగా క్లింకార ఫేస్ ని దాచేసి ఇప్పుడు క్లింకార ఫేస్ రివీల్ అయింది అంటూ ఎంతోమంది పోస్టులు పెట్టారు. అయితే కెమెరాలకు చిక్కిన క్లింకార ఫోటోలు సోషల్ మీడియాలో లోని కొన్ని ప్లాట్ ఫామ్స్ లలో వైరల్ గా మారడంతో రామ్ చరణ్ టీం వారికి ఒక వార్నింగ్ ఇచ్చింది. రామ్ చరణ్ టీం క్లింకార ఫేస్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది పూర్తిగా ప్రైవసీ ఉల్లంఘనే అంటూ పేర్కొన్నారు.


అంతేకాకుండా ఇలాంటి కంటెంట్ ని ప్రోత్సహిస్తే ప్రైవసీ నిబంధనలు,ప్లాట్ఫామ్ గైడ్లైన్స్ కి అనుగుణంగా కాపీరైట్స్ స్ట్రైక్స్ వేస్తామని గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు.అలా రామ్ చరణ్ టీమ్ వార్నింగ్ ఇవ్వడంతో క్లింకార ఫేస్ కి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్  చేసినవాళ్లు వెంటనే ఆ వీడియోలు ఫోటోలు డిలీట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగానే రామ్ చరణ్ ఉపాసన తమ కూతురి ఫోటోను బయటికి రివీల్ చేయకూడదని నిర్ణయించుకున్నారు. అందుకోసమే చాలా రోజుల నుండి క్లింకారని ఎక్కడికి వెళ్లినా కూడా ఆమె ఫేస్ బయటకి కనిపించకుండా కవర్ చేసి తీసుకువెళ్తున్నారు. తమ ఫ్యామిలీ ఫంక్షన్లో కూడా క్లింకార ఫేస్ ని బ్లర్ చేసి చూపిస్తున్నారు.ఇక ఆ మధ్యకాలంలో బాలకృష్ణ హోస్ట్ గా చేసే అన్ స్టాపబుల్ షోలో తన కూతురు ఎప్పుడైతే తనని నాన్న అని పిలుస్తుందో అప్పుడు తన కూతురి ఫేస్ ని రివీల్ చేస్తానని రామ్ చరణ్ చెప్పినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా రామ్ చరణ్ తన కూతురి ఫోటోను బయటికి రివీల్ చేయడానికి ఇష్టపడడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: