నాగార్జున షాకింగ్ డెసీషన్..పాపం ఫ్యాన్స్ ఎలా తట్టుకుంటారో ఏమో..?
ఈ ఎంతో ముఖ్యమైన సినిమాకు తమిళ సినీ పరిశ్రమకు చెందిన టాలెంటెడ్ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. కథ, స్క్రీన్‌ప్లే విషయంలో ప్రత్యేకమైన శైలికి పేరున్న కార్తీక్, నాగార్జున 100వ సినిమాను చాలా విభిన్నంగా తెరకెక్కిస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాను నాగార్జున స్వయంగా నిర్మించడం మరో విశేషం. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.సాధారణంగా ఇంత పెద్ద హీరో 100వ సినిమా అంటే పూజా కార్యక్రమాల నుంచి లొకేషన్ ఫోటోలు, షూటింగ్ అప్డేట్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు, సోషల్ మీడియా హడావుడి అంటూ భారీగా ప్రచారం జరుగుతుంది. కానీ నాగార్జున 100 సినిమా విషయంలో మాత్రం మేకర్స్ పూర్తిగా భిన్నమైన దారిలో నడుస్తున్నారు. ఎలాంటి హంగామా లేకుండా, చాలా సైలెంట్‌గా షూటింగ్‌ను కానిచ్చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటివరకు ఈ సినిమా గురించి బయటకు చిన్న అప్డేట్ కూడా లీక్ కాలేదు.
ఇటీవల ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. నాగార్జున 100 సినిమా మేకర్స్ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. అదేంటంటే, ఈ సినిమాను పూర్తిగా గోప్యంగా పూర్తి చేయాలని వారు ఫిక్స్ అయ్యారట. అందులో భాగంగానే సినిమా ప్రారంభానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా ఎవరికీ తెలియకుండా, చాలా ప్రైవేట్‌గా నిర్వహించారట. సాధారణంగా మీడియా, అభిమానుల సందడి లేకుండా ఈ కార్యక్రమాలు జరగడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం.అలాగే షూటింగ్ ప్రక్రియ కూడా అత్యంత రహస్యంగా సాగుతోందట. లొకేషన్లలో కఠినమైన నిబంధనలు అమలు చేస్తూ, ఎలాంటి ఫోటోలు లేదా వీడియోలు బయటకు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారట మేకర్స్. షూటింగ్ స్పాట్‌లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా కఠినమైన సూచనలు ఇచ్చారని సమాచారం. సోషల్ మీడియా లీకులు, కథకు సంబంధించిన వివరాలు బయటకు రావకుండా మేకర్స్ చాలా స్ట్రాంగ్‌గా వ్యవహరిస్తున్నారట.
ఇక అప్డేట్స్ విషయానికి వస్తే, షూటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి అధికారిక సమాచారం బయటకు ఇవ్వకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్, టైటిల్, టీజర్, ట్రైలర్ వంటి అప్డేట్స్ అన్నీ షూటింగ్ పూర్తయ్యాకే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇలా పూర్తిగా సీక్రెట్ మోడ్‌లో సినిమాను పూర్తి చేసి, ఒక్కసారిగా బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వాలనేది మేకర్స్ ప్లాన్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.మొత్తానికి నాగార్జున కెరీర్‌లో 100వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్, కేవలం ఒక సినిమా మాత్రమే కాదు… ఆయన సినీ ప్రయాణానికి ఒక గుర్తుగా నిలవబోతుందనే భావన అభిమానుల్లో బలంగా ఉంది. ఇంత రహస్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి కథతో, ఏ రేంజ్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందో చూడాలి. ఈ సైలెంట్ స్ట్రాటజీ చివరికి నాగార్జునకు, మేకర్స్‌కు ఎంత పెద్ద సక్సెస్ తీసుకొస్తుందో అన్నది మాత్రం రిలీజ్ తర్వాతే తెలుస్తుంది.