మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను ఈ మూవీ విడుదలకు ముందు రోజు అనగా జనవరి 11 వ తేదీన ప్రదర్శించారు. ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారానే మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు నుండి అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి.
ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 19 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. విడుదల అయిన 19 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది. కానీ విడుదల అయిన 19 వ రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల విషయంలో మాత్రం ఈ సినిమా చాలా వెనకబడిపోయింది. విడుదల అయిన 19 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 సినిమా 2.18 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా , బాహుబలి సినిమా 1.80 కోట్లు , సంక్రాంతికి వస్తున్నాం సినిమా 1.59 కోట్లు , అత్తారింటికి దారేది సినిమా 1.38 కోట్లు , పుష్ప పార్ట్ 2 మూవీ 1.35 కోట్లు , గీత గోవిందం 1.32 కోట్లు , దేవర పార్ట్ 1 మూవీ 1.02 కోట్లు , హనుమాన్ ఒక కోటి , కార్తికేయ 2 మూవీ 96 లక్షలు , మహానటి 95 లక్షలు , ఇక మన వర ప్రసాద్ గారు మూవీ విడుదల అయిన 19 వ రోజు 91 లక్షల కలెక్షన్లను వసూలు చేసి విడుదల ఆయన 19 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో 11 వ స్థానంలో నిలిచింది. ఇకపోతే ఈ సినిమా 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో కాస్త వెనకబడిపోయిన ఈ మూవీ 19 వ రోజు మాత్రం అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది అని చెప్పవచ్చు.