ఆ రెండు సినిమాల బాక్సఫీస్ వార్.. ప్రేక్షకుల్లో భారీ ఉత్కంఠ నెలకొననుందా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ మాస్ ఈమేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవి , బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకున్నారు . వీరికి మాస్ ఆడియన్స్ లో అద్భుతమైన క్రేజ్ ఉంటుంది. ఇకపోతే వీరిద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ నెలకొనబోతుంది అంటేనే దాని గురించి ఎంతో మంది ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. ఇప్పటి వరకు అనేక సార్లు చిరు , బాలయ్య సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి మరో సారి నెలకొనే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.


అసలు విషయం లోకి వెళితే ... బాలకృష్ణ , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడింది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం  సంక్రాంతి బరిలో నిలిపే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి , బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఈ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నిలపాలి అని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చిరంజీవి , బాలకృష్ణ హీరోలుగా రూపొందబోయే సినిమాలు వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ రెండు సినిమాలు గనుక వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నిలిచినట్లయితే ఈ రెండు సినిమాలలో ఏ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకుంటుంది అనే ఆసక్తి జనాల్లో భారీగా పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: