ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా అనేక తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా మొదటగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన రాజా సాబ్ మూవీ జనవరి 9 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి కాస్త నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. ఇక ఈ మూవీ తర్వాత జనవరి 12 వ తేదీన చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ విడుదల అయింది. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ జనవరి 13 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చిన ఈ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. ఈ సినిమా తర్వాత నవీన్ పోలిశెట్టి హీరో గా రూపొందిన అనగనగా ఒక రాజు సినిమా విడుదల అయింది.
ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక జనవరి 14 వ తేదీన శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన నారీ నారీ నడుమ మురారి సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన సినిమాలలో మన శంకర వర ప్రసాద్ గారు , అనగనగా ఒక రాజు , నారీ నారీ నడుమ మురారి సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకోగా ... రాజా సాబ్ , భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఇప్పటికే ఈ సంవత్సరం సంక్రాంతి సినిమాల బాక్స్ ఆఫీస్ లెక్కలు ఆల్మోస్ట్ క్లియర్ అయ్యాయి. ఇక ఈ మూవీ లు మరికొన్ని రోజుల్లోనే ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. మరి అక్కడ ఏ సినిమాలు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటాయో చూడాలి.