ప‌వన్ క‌ళ్యాణ్ డైరెక్ట‌ర్‌తో నాగ‌చైత‌న్య సినిమా.. ఇద్ద‌రు క్రేజీ హీరోయిన్లు..?

RAMAKRISHNA S.S.
అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య - మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో ఒక భారీ సినిమా రాబోతుందనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ క్లాస్ ఆడియన్స్‌కు ద‌గ్గ‌రైన నాగచైతన్య, పక్కా మాస్ అంశాలతో సినిమాలను తెరకెక్కించే హరీష్ శంకర్ కలిసి పనిచేయడం ఇంట్ర‌స్టింగ్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాపై చర్చలు గత కొంతకాలంగా జరుగుతున్నా, తాజాగా ఒక పక్కా స్క్రిప్ట్ లాక్ అయినట్లు సమాచారం. హరీష్ శంకర్ తన మార్కు ఎనర్జీతో చైతన్యను మునుపెన్నడూ చూడని ఒక మాస్ అవతారంలో చూపించబోతున్నారట‌. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే అక్కినేని అభిమానులకు ఒక పెద్ద ట్రీట్ లా మారుతుంది.


హరీష్ శంకర్ చెప్పిన ఒక లైన్ చైతన్యకు బాగా నచ్చడంతో పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధం చేయమని కోరిన‌ట్టు టాక్ ? హ‌రీష్ శంక‌ర్ ప్ర‌స్తుతం పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' తదుపరి షెడ్యూల్ కోసం వేచి చూస్తున్నారు. ఈ గ్యాప్‌లోనే నాగచైతన్య సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోందని, ఇందులో చైతన్య డైలాగ్ డెలివరీ సరికొత్తగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
ఈ క్రేజీ కాంబినేషన్ వెనుక ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించడానికి నిర్మాతలు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.


హరీష్ శంకర్ సినిమాల్లో కథానాయికల పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో చైతన్యకు జోడీగా నటించే హీరోయిన్ ఎవరనే దానిపై కూడా ఇప్పటికే రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీలీల లేదా మీనాక్షి చౌద‌రిల‌లో ఎవ‌రో ఒక‌రు నటించే అవకాశం ఉంది. నాగచైతన్యకు మాస్ ఇమేజ్ పెంచేలా హరీష్ శంకర్ తనదైన శైలిలో స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నార‌ట‌. గతంలో వీరిద్దరూ వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల కుదరని ఈ కలయిక, ఇప్పుడు కార్యరూపం దాల్చడం విశేషం.


ఈ సినిమా నాగచైతన్య కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. క్లాస్ ఇమేజ్ ఉన్న హీరోను మాస్ డైరెక్టర్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలని సామాన్య ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. హరీష్ శంకర్ మార్కు పంచ్ డైలాగులు, నాగచైతన్య నటన తోడైతే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయం. అక్కినేని హీరోలకు మాస్ హిట్లు చాలా అవసరమైన తరుణంలో, హరీష్ శంకర్ వంటి దర్శకుడు తోడవ్వడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: