చిరంజీవి చివరి కోరికని రామ్ చరణ్ కొడుకు నెరవేరుస్తాడా.?

Pandrala Sravanthi
మెగా ఫ్యామిలీలో ఈ మధ్యనే సంబరాలు మిన్నంటాయి. దానికి కారణం ఉపాసన కవల పిల్లలకి జన్మనివ్వడమే. అయితే చిరంజీవికి ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు.. వీరిలో ఇద్దరు కూతుర్లకి కూతుర్లే పుట్టారు.. ఇప్పటివరకు చిరంజీవి ఫ్యామిలీలో ఒక్క మగసంతానం కూడా లేదు. రామ్ చరణ్ కైనా కొడుకు పుడతాడు అనుకుంటే అందరి అంచనాలు తారుమారు చేసి అమ్మాయి పుట్టింది.దాంతో కొంతమంది మెగా ఫ్యాన్స్ చిరంజీవి ఇంట్లో మగసంతానం ఉండదని, మెగా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మనవడు లేడని బాధపడ్డారు.కానీ రీసెంట్ గా ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చింది. అలా ఒక పాప ఒక బాబు పుట్టడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు ఆకాశాన్నంటాయి. అలా చిరంజీవి ఎప్పటినుండో తన ఇంట్లో మనవడు కావాలి అని కోరుకున్న కోరిక నెరవేరింది. 


ఫైనల్ గా మెగా బుల్లి వారసుడు వచ్చేసాడు. ఇదంతా పక్కన పెడితే గతంలో చిరంజీవి తన చివరి కోరిక ఇదే అంటూ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టిన వీడియో తాజాగా రాంచరణ్ కి కొడుకు పుట్టడంతో వైరల్ అవుతుంది. మరి ఇంతకీ చిరంజీవి చివరి కోరిక ఏంటి.. దాన్ని రామ్ చరణ్ కొడుకు నెరవేరుస్తాడా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఇప్పటి వరకు నా ఫ్యామిలీలో ఉన్న అందరితో కలిసి వర్క్ చేశాను. అలా నా తమ్ముళ్లు, నా కొడుకు రామ్ చరణ్ లతో కలిసి వర్క్ చేశాను.కానీ నాకున్న ఏకైక కోరిక ఏంటంటే రామ్ చరణ్ కి ఓ కొడుకు పుట్టాలి. వాడితో ఎప్పటికైనా నేను ఓ సినిమా చేయాలి అనేదే నా కోరిక..


చైల్డ్ ఆర్టిస్ట్ గా నా మనవడు చేస్తే వాడితో స్క్రీన్ షేర్ చేసుకోవాలన్నదే నా చివరి కోరిక అంటూ చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు.అయితే ఫైనల్ గా చిరంజీవి కోరిక అయితే నెరవేరబోతుంది.ఎందుకంటే రామ్ చరణ్ కి కొడుకు పుట్టడంతో కచ్చితంగా చిరంజీవి తన కోరిక నెరవేర్చుకుంటారు. అయితే చిరంజీవి కోరిక నెరవేరాలంటే మరికొద్ది సంవత్సరాల సమయం పడుతుంది. ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయాలంటే కనీసం ఏడు ఎనిమిది సంవత్సరాలైనా కావాలి.మరి ఆ ఏడు ఎనిమిది సంవత్సరాల వరకు చిరంజీవి సినిమాలోనే కొనసాగుతారా.. తన మనవడితో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనే కోరికను నెరవేర్చుకుంటాడా అనేది ముందు ముందు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: