‘విశ్వంభర’ ఆలస్యం ఎందుకంటే ఇదే.. మేకర్స్ ఇచ్చిన స్ట్రాంగ్ క్లారిటీ!
ఈ సినిమా ఆలస్యానికి ప్రధాన కారణం ఇందులోని గ్రాఫిక్స్ షాట్స్. దాదాపు 4,800 వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయని, రెండో భాగం మొత్తం విజువల్స్ పైనే ఆధారపడి ఉంటుందని డైరెక్టర్ వశిష్ఠ వెల్లడించారు.హాంకాంగ్ మరియు హైదరాబాద్‌లోని టాప్ స్టూడియోలు ఈ సినిమా కోసం పగలు రాత్రి కష్టపడుతున్నాయి. కేవలం గ్రాఫిక్స్ కోసమే సుమారు ₹75 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారట. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూపించాలన్నదే మెగాస్టార్ పట్టుదల."ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలపై తాజాగా చిరంజీవి గారు స్పందించారు. ఈ సినిమాను జులై 9, 2026న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. వేసవి సెలవుల తర్వాత వచ్చే ఈ డేట్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుందని అంచనా వేస్తున్నారు.నిర్మాతలు వంశీ, ప్రమోద్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయబోతున్నారు.
ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరూ దాదాపు 18 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని టాక్.మొదటి టీజర్ లోపాలను సవరిస్తూ, ఈసారి ఒక సాలిడ్ విజువల్ వండర్‌లాంటి రెండో టీజర్‌ను సిద్ధం చేస్తున్నారట. దీనికి సంబంధించి త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.మొత్తానికి 'విశ్వంభర' ఆలస్యం వెనుక ఒకే ఒక కారణం.. అది 'క్వాలిటీ'. చిరంజీవి గారికి తన అభిమానులకు ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వాలని ఉంది. అందుకే ఈ వెయిటింగ్. జులైలో థియేటర్లు దద్దరిల్లడం, రికార్డులు బద్దలవ్వడం ఖాయం!